ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున పెను విషాదం చేటు చేసుకుంది. రామవరం సమీపంలో పలకల క్వారీల వద్ద జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో పదిమంది ప్రయాణికులు బస్సులో మంటలకు ఆహుతయ్యారు.క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు ,టిప్పర్ ఎదురెదురుగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.ఈ ప్రమాదంలో రెండు వాహనాలు బలంగా ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉండే కొంతమంది బయటికి రాలేకపోయారు.


అక్కడ ప్రత్యేక సాక్షుల కథనం ప్రకారం.. హైదరాబాదు నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపుకు వెళుతున్నటువంటి ఈ ప్రైవేటు బస్సు, రామవరం క్వారీల వద్ద వేగంగా వస్తున్న టిప్పర్ ను చాలా బలంగా ఢీ కొట్టిందని దీంతో డీజిల్ ట్యాంకు పగిలిపోవడంతో క్షణాల్లో మంటలు రెండు వాహనాలకు వ్యాపించాయని, ఆ మంటలు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే ప్రయాణికులు తమ సీట్ల నుంచి లేచి బయటికి వచ్చే లోపు అందులోనూ కొంతమంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. ప్రమాద స్థలంలో బస్సులు సుమారు 40 ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.


అయితే ప్రయాణికులలందరూ కూడా గాఢ నిద్రలో ఉండడంతో ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొంతమంది కిటికీలు పగలగొట్టుకొని మరి తమ ప్రాణాలతో బయటపడగా మరికొంతమంది లోపల చిక్కుకుపోయారని, మరి కొంతమందికి తీవ్రమైన గాయాలతో బయటపడ్డారు. రానున్న గంటలలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలిసిన వెంటనే ఆ సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి చేశారు. క్షతగాత్రుల  చికిత్స కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాలిన మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా ఉండడంతో వారిని గుర్తించడం ఇప్పుడు పోలీసులకు సవాల్ గా మారింది. మరి ఈ విషయంపై అధికారికంగా పోలీసులు తెలియజేస్తారమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: