పూర్తి వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లాకు చెందిన చింతాడ రవీంద్ర (35) నేవీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. ఈయన విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్లో తన భార్యతో కలిసి నివసిస్తున్నారు. అయితే అతని భార్య నెల రోజుల క్రితం విజయనగరంలోని పుట్టింటికి వెళ్ళగా, విశాఖకు చెందిన మౌనికతో రవీంద్రకు గతంలోనే పరిచయం ఉన్నదట. వీరి మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి రవీంద్ర తన ప్రియురాలు మౌనికను తన సొంత ఫ్లాట్ కు పిలిపించుకోగా,అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రవీంద్ర తన ప్రియురాలు పైన అత్యంత దారుణంగా ప్రవర్తించారు.
మౌనికను హత్య చేసి ఆమె శరీర భాగాలను రెండు ముక్కలుగా చేసి ఒకటి ఫ్రిజ్లో మరొకటి సంచిలో దాచారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి లొంగిపోయాడు. నిందితుడు తెలిపిన వివరాలతో పోలీసులు తన ఫ్లాట్ కు వెళ్లగా.. ఫ్రిజ్లో రెండు మూటలలో ఉన్న శరీర భాగాలను గుర్తించారు అధికారులు. అయితే తల భాగం మాత్రం కనిపించలేదని పోలీసులు తెలియజేస్తున్నారు. రవీంద్రనాథ్ అదుపులోకి తీసుకున్న పోలీసులు సైతం కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల విచారణలో మౌనిక తనను డబ్బుల కోసమే వేధిస్తోందని ఆ హింస భరించలేక ఇలాంటి పని చేశానంటూ నిందితుడు తెలిపినట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి