ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వ్యవహారంపై తీవ్రస్థాయిగా ఫైర్ అయ్యారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా ఎవరు వ్యవహరించిన సరే వారిని ఉపేక్షించనంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. క్రమశిక్షణను ఉల్లంఘించింది ఎవరైనా సరే ఖచ్చితంగా చర్యలు తప్పవని, కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీని పణంగా పెట్టి మరి ఇలా వ్యవహరిస్తున్నారని ఇలాంటి వాటికి పార్టీ సిద్ధంగా లేదని తెలియజేశారు.


పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా సరే వారిని ఇక భరించబోమని మరో రెండో ఆలోచన లేకుండా సస్పెండ్ చేస్తామంటూ తీవ్రస్థాయిలో అసంతృప్తిని తెలియజేశారు. ఇటీవలే పల్నాడులో ఎస్పి ఆఫీసులో నరసారావు ఎమ్మెల్యే డాక్టర్ సిహెచ్ అరవిందబాబు వ్యవహారం సీఎం చంద్రబాబు నాయుడుకు కోపం తెప్పించింది. జిల్లా పోలీస్ సేల్ న్యాయ సలహాదారునిగా తాను సూచించిన రామినేనిప్రసాద్ పేరును ఎందుకు అంగీకరించలేదంటూ ఎమ్మెల్యే ఎస్పీ కృష్ణారావుతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై మార్చి 31న మంగళవారం నాడు ఎస్పీ ఆఫీసుకు వెళ్లారు ఎమ్మెల్యే.


ఎనిమిది నెలల క్రితమే న్యాయ సలహాదారు  నియామకం పైన లేఖ పంపించినప్పటికీ ఇప్పటివరకు ఇంకా సంతకం ఎందుకు చేయలేదంటూ ఎమ్మెల్యే నిలదీశారు. విచారణ తర్వాత సంతకం చేస్తానంటూ ఎస్పీ చెప్పిన కూడా ఆర్డర్ కాపీ ఇచ్చేవరకు వెళ్లేది లేదంటే ఎమ్మెల్యే బీస్మించుకొని కూర్చున్నారు. అలా 10 గంటల పాటు అక్కడే ఉన్న ఎమ్మెల్యేకు మంత్రులు ఫోన్ చేసిన కూడా స్పందించకపోవడంతో ఈ ఎమ్మెల్యే వ్యవహారం అధిష్టానం వరకు వెళ్లగా సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని తెలియజేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే తనకు కావలసిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఇలా రచ్చ చేయడంతో ఈ విషయం పైన సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లాగా పార్టీకి చెడ్డ పేరు ఎవరు తెచ్చినా సరే సహించమని, సస్పెండ్ చేస్తామంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: