అందమైన ఉద్యానవానాలు, రకరకాల పూల తోటలు, అరుదైన ఔషద మెక్కలు వెరసీ ఆకుపచ్చ వనంలో విరబూసిన వెన్నెల పుష్పంలా ఉంది రాష్ట్రపతి నిలయం. రాజసం ఉట్టిపడేలా నిర్మించిన ఈ అద్భుత భవనాన్నిచూసి సందర్శకులు తనివితీరా ఆశ్వాదించారు. వారం రోజుల పాటు రాష్ట్రపతి నిలయాన్నిసందర్శనకు అనుమతించడంతో అద్భుత కట్టడాన్ని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు సందర్శకులు. హైదరాబాద్ లోని బొల్లారంలో 76 ఎకరాల విస్తీర్ణంలో రూపు దిద్దుకున్నఈ అపురూప కట్టడాన్నిచూసి సందర్శకులు మంత్ర ముగ్ధులయ్యారు. ఈ నెల 12 వరకు సందర్శకులను అధికారులు అనుమతించడంతో అధికసంఖ్యలో అనేకులు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు.
ప్రధమ పౌరుడైన రాష్ట్రపతి నిలయంలో కుటుంబ సమేతంగా సందర్శకులు వీక్షించి సందడిగా గడిపారు. అంతేకాదు వరుసగా సంక్రాంతి సెలవులు రావడంతో కుటుంబసమేతంగా రాష్ట్రపతి నిలయాన్ని చూశారు. అప్పట్లోనే ఇంత అద్భుతంగా నిర్మించిన కట్టాడాలను చూసి సందర్శకులు మైమరచి పోతున్నారు. ఈ అద్భుత కట్టడం ఇప్పటికి చరిత్రను సృష్టిస్తోంది. 1805 లో నిర్మించిన ఈ అధ్బుత భవన సముదాయం పూర్వంలో ఆంగ్లేయ పాలకుల రెసిడెన్సీగా ఉండేది. అయితే 1950 నుంచి రాష్ట్రపతి నిలయంగా దక్షిణాదిగా రాష్ట్రపతికి విడిది నిలయంగా మారిందని చరిత్ర చెబుతోంది. ఇంతటి ప్రశాంత వాతావరణంలో సుందరమైన రాష్ట్రపతి నిలయాంలో విడిది కోసం రాష్ట్రపతి ఎంతగానో ఆప్యాయత చూపే వారని ఎస్టేట్ అధికారులు అంటున్నారు.
అందుకనే కాబోలు రాష్ట్రపతి ప్రతిఏటా బోల్లారంలోని ఈ నిలయంలో విడిది కోసం రెండు సార్లు ఇక్కడి వస్తుంటారు. మరోవైపు ఈ సుందర వణాన్ని చూసి సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి నిలయానికి ప్రత్యేక ఆకర్షణ ఉద్యాన వణాలు. మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ 2010లో ఈ ఉద్యాన వనాన్ని ప్రారంభించారు. 1.6 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 113 రకాల వనమూలికలు, చెట్లసముదాయాన్ని ఇక్కడ అందుబాటులో ఉంచారు. అయితే ఆయుర్వేదం, యునానీ మెక్కలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఇక్కడ వెలసిన సుందరమైన పూల తోటలు ఉద్యానవనాలే కాక పంటపోలాలు ప్రశాంత వాతావరణం మనసుకు ప్రశాంతతనిస్తుందని సందర్శుకులు అంటున్నారు. ప్రతి ఏటా రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించే విధంగా రెండు సార్లు ప్రభుత్వం అనుమతిస్తే బాగుంటుందంటున్నారు.
అయితే సందర్శకులను అనుమతించడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు రాష్ట్రపతి నిలయాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. వరుసగా సంక్రాంతి సెలవులు రావడంతో కుటుంబ సమేతంగా తిలకిస్తున్నారు. ఈ సుందరమైన ప్యాలెస్ చుట్టు ఎక్కడి కక్కడ సందర్శకులకు రాష్ట్రపతి నిలయం గురించి తెలియజేసేలా ప్రత్యేక బోర్డులను అమర్చారు. లైబ్రరీ రూం, పూజాగది, హెల్త్ క్లీనిక్, సమావేశమందిరం, డైనింగ్ హాల్, రహస్య సమావేశం మందిరం, సొరంగ మార్గం ద్వారా రాష్ట్రపతి క్యాంటిన్, దోబిఘాట్ తో పాటు పూర్వం దేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన వారందరి వివరాలను ఇంగ్లీష్, తెలుగు రెండు బాషల్లోను అర్దమయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 76 ఎకరాల్లోని పంట పొలాల్లోని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను రాష్ట్రపతికి భోజనంలో ఉపయోగించేవారు. రాష్ట్రపతి నిలయంలో ఉన్న బ్రిటీషర్స్ కాలంనాటి బావి ద్వారానే ఈ పంటలన్నింటికి సాగునీరు అందించేవారు స్వచ్చమైన గాలి, అందమైన ఈ పంట పొలాలు చూసి అటు సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: