ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీయార్ రాష్ట్రాలు పట్టి తిరుగుతున్నారు. మొన్న ఒడిషా చీఫ్ మినిస్టర్ని కలసిన కేసీయార్, నిన్న మమతతో భేటీ వేశారు. డిల్లీకి చేరుకుని మరిన్ని పార్టీల అధినేతలను కలిసేలా టూర్ ప్లాన్ చేసుకున్న కేసీయార్ ఇపుడు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెర తీశారు.


మోడీతో ఏం పని :


కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ పై మొదటి నుంచి విమర్శలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోదీతో కేసీయార్ భేటీపై ఈ రోజు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఫెడరల్ ఫ్రంట్ అంటున్న కేసీయార్ మోడీతో భేటీ వేయడంలో ఆంతర్యం ఏంటని బాబు ప్రశ్నిస్తున్నారు. అంటే తాను చెప్పినట్లుగానే కేసీయార్ ఫ్రంట్ ప్రయోగం అంతా చివరకు బీజేపీకి మేలు చేయడానికేనని బాబు అంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి మోడీకి బ్రీఫింగ్ చేయడానికే కేసీయార్ ప్రధానిని కలిశారని బాబు ఆరోపిస్తున్నారు. 


అనుమానాలేనా :


ఇదిలా ఉండగా కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో పెద్దగా అడుగులు పడుతున్న దాఖాలాలు కూదా లేవు. ఒడిషా చీఫ్ మినిస్టర్ని ఇలా కలిసారో లేదో మరో వైపు ఆయన పంపున మంత్రి వచ్చి అమరావతిలో బాబుతో మీట్ అయ్యారు. ఇక ఇంకోవైపు మమతా బెనర్జీ కూడా కేసీయార్ తో పెద్దగా ఫ్రంట్ పై ఆసక్తి చూపకపోవడం కూడా చర్చనీయాంశంగా ఉంది. ఈ నేపధ్యంలో డిల్లీలో కేసీయార్ రెండు రోజులు ఉండబోతున్నారు. అక్కడ ఎంతమందిని కలుస్తారన్నది కూడా ఇపుడు చూడాలి. ఇంకోవైపు చంద్రబాబు లాంటి  వారు మోడీ కి మేలు చేసేందుకే కేసీయార్ ఫ్రంట్ అంటూ ప్రచారానికి తెరలేపడం కూడా ఇతర పార్టీల నాయకులు ఈ వైపుగా చూడకపోవడానికి కారణంగా భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: