ఆడపిల్లగా జన్మించడం ఓ వరం.ఎందుకంటే ఆమె బ్రతుకులో ఎన్నో బరువులను మోస్తుంది.ఒక బిడ్దలా పుట్టి,తల్లిలా మారి భార్యలా కన్నుమూస్తుంది.మగవాడు తండ్రి అయ్యాడు,తాత అయ్యాడు అంటే ఆ పిలుపు అతన్ని వరించడానికి ఓ ఆడపిల్ల ఓర్పు,శక్తి దాని వెనక దాగుంటుంది.అన్నీంటికి మించి తను ఓ తల్లిలా మారాలంటే తన ప్రాణాలను పణంగా పెట్టాలి.తాను ప్రెగ్నెన్సి అయ్యినప్పటినుండి తన బిడ్డను తాను కళ్ళ చూస్తుందో లేదో తనకే తెలియదు.ఒక వేళ జరగరానిది జరుగుతే ఆతల్లి లోకాన్ని చూడలేదు.అంతా సవ్యంగా జరిగితే తల్లి బిడ్దలు క్షేమంగా ఉంటారు.నిజం చెప్పాలంటే ఆడపిల్లకు మరో పిల్లను జన్మనివ్వడం అనేది పునర్జన్మ లాంటిది.అమ్మతనం పొందాలంటే మరణించి మళ్లీ బ్రతకాల్సి వస్తుంది.మనం తరచుగా వింటుంటాం.



పురిట్లోనే పాపం పిల్లకు జన్మనిచ్చి తల్లి చనిపోయిందనే మాట దీన్ని బట్టి అర్ధం ఏమవుతుందంటే ప్రాణం తీయడం కష్టం కాదు ప్రాణం పోయడం చాలా కష్టం అని.అందుకే సగటు ఆడపిల్ల తన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా అమ్మ అవ్వడానికి ప్రేమగా అంగీకరిస్తుంది.ఇదే ఆమెలోవున్న గొప్పతనం.ఇదంతా బాగానే వుంది కాని ఈ మధ్యచేసిన పరిశోధనల్లో ఓ నిజం బయటపడిందట అదేంటంటే పిల్లలు లేని మహిళలతో పొల్చిచూస్తే పిల్లలున్న మహిళ సాధారణ జీవితాకాలం కంటే 11 ఏళ్లు తక్కువగా ఉంటుందంటూ జార్జ్‌ మాసన్‌ యూనివర్సిటీ తాను చేసిన అధ్యయనంలో తెలిసిందని వెల్లడించింది.మానవ క్రోమోజోముల్లో ఉండే టెలోమేర్స్‌ సగటు జీవితకాలం,పిల్లలున్న మహిళల్లో తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.



అయితే, ప్రస్తుత పరిశోధనలు ప్రాధమిక దశలో ఉన్నాయని,మరింత అధ్యయనం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని యూనివర్సిటీ రిసెర్చర్‌ జె పోలాక్‌ తెలిపారు.పిల్లలు పుట్టిన తర్వాత టెలోమేర్స్‌ పొడవు తగ్గిపోతుందా లేదా అన్న విషయాన్ని కూడా ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని ఆమె చెప్పారు.క్రోమోజోమ్స్‌ పనితీరుకుతోడు పని ఒత్తిడి, సామాజిక స్థితిగతులు కూడా మహిళ ఆయుష్షుపై ఏవిధమైన ప్రభావాన్ని చూపుతాయో పరిశోధనలు చేస్తున్నామన్నారు.త్వరలోనే దీనిపై ఓ నివేధికను తయారు చేసి ప్రపంచానికి తెలియచేస్తామని వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: