చిన్న బాధ కలిగిన చెప్పుకోలేని పసి ప్రాణాలపై డాక్టర్ల పైశాచిక ప్రయోగాలు చేసిన ఘటన  హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌లో వెలుగు చూసింది. ప్రాణం పోయాల్సిన డాక్టర్లే పైసలకు కాకృతిపడి అబం సుభం  తెలియని చిన్నారులపై  క్లినికల్ ట్రయల్స్‌కు పాల్పడ్డారు.  ప్రయోగ దశలో ఉన్న ఔషధాలు, వ్యాక్సిన్లను చిన్నారుల తల్లితండ్రులకు కూడా తెలియకుండా  రహస్యంగా ఎక్కించారు.గత కొంత కాలంగా ఫార్మా కంపెనీలు కొత్తగా రూపొందించిన ఔషధాలు, వ్యాక్సిన్లను గుట్టు చప్పుడు కాకుండా పిల్లలపై ప్రయోగిస్తున్నారు. 

నీలోఫర్‌లోని కొందరు డాక్టర్లు ఇందుకు సహకరిస్తున్నారని, నిషేధిత డ్రగ్స్ కూడా క్లినికల్ ట్రయల్స్‌లో వాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో.. ఈ ఘటనపై విచారణ జరపాలని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు డాక్టర్ల మధ్య  గొడవ రావటంతో క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం బయటకు పొక్కింది. 


క్లినికల్‌ ట్రయల్స్‌ చేసినందుకు కొందరు డాక్టర్లకు ఫార్మా కంపెనీలు భారీగా డబ్బులు ముట్టజెప్పినట్టు తెలుస్తుంది. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ.. అధికారులెవరూ మననించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటివరకు 50 మంది పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయంటూన్నారు ఫార్మా కంపెనీలతో కలిసి పిడియాట్రిక్స్‌ విభాగంలో పనిచేసే ఓ ప్రొఫెసర్‌ అనధికారికంగా క్లినికల్ ట్రయల్స్‌ చేస్తున్నాడు.

సదరు ప్రొఫెసర్ పిల్లలకు వ్యాక్సిన్లు ఇవ్వడంతోపాటు.. తల్లిదండ్రులకు తెలియకుండా వారి రక్త నమూనాలు కూడా సేకరించేవాడని తెలుస్తుంది. క్లినికల్‌ ట్రయల్స్‌ కావాల్సిన అన్ని అనుమతులు తీసుకున్నానని ఆ ప్రొఫెసర్ చెబుతుండటం సోచనీయం. ప్రభుత్వం ఇటువంటి దారుణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందని కోరుతున్నారు సామాన్య ప్రజలు.  పిల్లల ఆస్పత్రిగా పేరు గాంచిన హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రి.. ఇలాంటి దారుణాలకు వేదికగా మారటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్నారు. 


    మరింత సమాచారం తెలుసుకోండి: