ఇంత పెద్ద దేశం నడుస్తోంది మహిళలతోనే అని చెప్పడానికి గర్వపడాలో, బాధ పడాలో తెలియన పరిస్థితి భారతీయులది. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన రోజే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని కలలు కన్న మహాత్ముని దేశంలో ఇప్పుడు వారిదే రాజ్యం. అయినా సరే ఆమహాత్మగాంధి కల నెరవేరిందని మాత్రం చెప్పలేని స్థితి.  తిరగడమేమిటి, ఏకంగా దశాబ్దాల తరబడి పాలిస్థున్నారు. అయితే సర్కారు సుస్థిరంగా పాలించడంలో ఎంతటి ఘనత చూపిస్తున్నారో , అంతే ఘనత ప్రభుత్వాన్ని అస్థిరపరచడంలోను చూపిస్థున్నారు. పలితం మన ప్రభుత్వాలు అధికారం కాపాడుకోవడం కోసమే పాట్లు పడాల్సి వచ్చి అభివృద్దిని, ప్రజాప్రయోజనాలను వదిలేయాల్సి వస్తోంది. అంటే అన్నం పెట్టే చేతులతోనే సున్నం కూడా పెడుతున్నారన్న మాట. ఇంతటి స్థాయికెదిగిన మన మహిళాలోకాన్ని చూసి సంబరపడాలా, ఇదేమి గోల అంటూ బాధపడాలా అన్నది అర్థంకాని పరిస్థితి భరతజాతికి దాపురించింది.  మనదేశాన్ని దశాబ్దాలతరబడి ఏకధాటిగా పాలించింది ఇందిరాగాంధి. ఏకపార్టి పాలనతో ఆమె మనఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పారు. ఎన్నో సంస్కరణలు చేపట్టి మనదేశాన్ని ప్రపంచంలోనే మిగిలిన దేశాలు ఆదర్శంగా తీసుకునేలా పాలించారు. చక్కటి మహిళా పాలన ఆమెతోనే ముగిసిపోయింది. ఇప్పుడు మనదేశం ఏకపార్టి పాలనలో కొన సాగే పరిస్థితులకు దూరమయింది. అంతా కూటముల రాజ్యమే. ఇంతకు ముందు ఎన్డీఏ పాలనలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దే కీలక పాత్ర. సర్కారు పాలనకు ఆమె ఊత మిచ్చింది. సర్కారును ఎన్నో సార్లు బెదిరించి అస్థిరపరచింది. దీంతో పాలనమాట దేవుడెరుగు దినదిన గండంగా బిజేపి పాలన సాగించింది.  ఇప్పుడు 2004 నుంచి ఏక ధాటిగా మనదేశాన్ని నడిపిస్తోంది కూడా మహిళనే. అధికారికంగా పీఠంపై మన్మోహన్ సింగ్ ఉన్నప్పటికి పాలన మొత్తం సోనియాగాంధి దేనని అందరికి తెలిసిందే. దీనికి సంబరపడేకన్నా బాధపడడమే మిన్న అన్నపరిస్థితి మనది. ఎందుకంటే లెక్కకు మించిన అవినీతి వెలుగు చూసింది. మంత్రులే ప్రజాప్రయోజనాలను పక్కన బెట్టి దోచుకున్నారు. ఇంకా స్కాంలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సోనియా సర్కారుకూడు అస్థిరతలో పడిపోయింది. కారణం ఎవరు అంటే మళ్లీ మహిళనే. ఆమెనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి. ఇన్నాళ్లు మద్దతిచ్చి ఇప్పుడు విరమించుకున్నారు.  ఈపరిస్థితిల్లో యూపిఏ సర్కారు ఆధారపడేది ఎవరిపై అంటే యూపిలోని ఎస్పి,బిఎస్పీలపై. అంటే ఇక్కడ బిఎస్పి అధినేత్రి మాయావతి మళ్లీ మహిళనే. ఆమె చేయూతనిస్తారో చేయిస్తారో తెలియదు. ఇదంతా ఎందుకు కూటముల రాజ్యంలో భవిష్యత్ ఇండియా కూడా మహిళల పైనే ఆధారపడనుంది. ఇప్పుడున్న యూపిఏ ,ఎన్డిఏలకు కాని లేదా కొత్తగా రూపుదిద్దుకుంటున్న మూడోఫ్రంట్ అయితేనేమి వాటిలో కూడా కీలకం మహిళలే. జయలలిత,మమతా, మాయావతి పాత్రలే ఏకూటమికైనా ప్రధానం కానున్నాయి. అంటే నిద్రలేచింది మహిళాలోకం...అన్నమాట. అంతవరకు బాగానే ఉంది,కాని నిద్రలేచి మిగిలిన వారి నిద్ర చెడగొడితేనే ప్రమాదం సుమా..... 

మరింత సమాచారం తెలుసుకోండి: