ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సూర్యనారాయణ స్వామి గుడిలో ఈ రోజున వేకువజాము నుంచి రథసప్తమి వేడుకలు ప్రారంభం కావడం జరిగాయి. స్వామి కైంకర్య ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారామ్, అరసవల్లి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాఠకర్ తదితరులు పాల్గొనడం జరిగింది. దీంతో ఆ సూర్య భగవానుని దర్శించుకునేందుకు ఎంతో మంది భక్తులు భారీ సంఖ్యలో వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల చేత విశాఖ శారదా పీఠం స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి ఇక్కడికి హాజరుకాలేకపోయారట.. దీంతో ఫలితంగా అక్కడ ఉండే అర్చకులతోనే కైంకర్య సేవలు పూర్తి చేయబడిందట.


శ్రీకాకుళం జిల్లాలోని ఈ స్వామి జయంతోత్సవాలు అర్ధరాత్రి నుంచి అంగరంగ వైభవంగా జరగడం మొదలయ్యాయి.. ఇక స్వామి వారికి కూడా ఉప ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయం 7 గంటల వరకు స్వామివారికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనంతో భక్తుల కు సాయంత్రం వరకు దర్శనమిస్తారు. సాయంత్రం వరకు పుష్పాలంకరణ తో, స్వామి వారిని భక్తుల కోసం సర్వదర్శనం ని కలిపిస్తారట. ఇక అక్కడి భక్తులు 108 సార్లు సూర్య నమస్కారాల కార్యక్రమాలను కూడా నిర్వహించారట. ఇక అంతే కాకుండా రోగ నిరోధకశక్తి పెంచేందుకు అక్కడ కొన్ని యోగాసనాలు కూడా నిర్వహించడం జరిగింది.

ఇక వీటిని అక్కడ యోగ విలేజ్ డైరెక్టర్ భాను కుమార్ ప్రారంభించడం జరిగింది. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సూర్యనారాయణ స్వామికి తొలి పూజ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశాడు. ప్రజలందరూ ఎంతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారని తెలియజేశాడు. ఇక ఇది సూర్యనారాయణస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఎంతో ఘనంగా సాగుతున్నాయని తెలియజేశాడు. కర్ఫ్యూ, కొవిడ్ ఆంక్షలు నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని భక్తులను అనుమతిస్తున్నట్లు గా ఆయన తెలియజేశాడు. ఇక ఈ స్వామిని దర్శించుకునేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, తదితరులు రావడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: