టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్,  బీసీసీఐ  సెలక్షన్ కమిటీ  ఛైర్మెన్ పదివికి దరఖాస్తు చేసుకున్నాడు. అంతేకాదు ఈ రేస్ లో అందరికి కన్నా అతనే ముందు వరస లో వున్నాడు. దాంతో చీఫ్ సెలక్టర్ గా  అజిత్  అగార్కర్ ఎంపికైయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కమిటీ లో పదవీకాలం పూర్తి చేసుకున్న చీఫ్ సెలక్టర్ ఏంస్కెకే ప్రసాద్ , సెలక్టర్ గగన్ ఖోడా స్థానాలను భర్తీ చేసేందుకు  బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది. నిన్నటి తో ఈ  సెలక్షన్ కమిటీ  పదవులకు  దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది.  కాగా అగార్కర్ ఈరెండు పదవులకు దరఖాస్తు చేసుకున్నాడు. 
 
ఇక అగార్కర్ కు ముంబై  సీనియర్ సెలక్షన్ కమిటీకి  చీఫ్ సెలక్టర్ గా  పనిచేసిన అనుభవం కూడా వుంది.  ఒకవేళ అగార్కర్ జాతీయ సెలక్షన్ కమిటీ కి  ఛైర్మెన్ గా ఎన్నికైతే సౌత్ జోన్ ను దృష్టిలో పెట్టుకుంటాడో లేదో చూడాలి.  అగార్కర్ భారత్ తరుపున ,191వన్డే లు, 26 టెస్టులు , 3టీ 20లకు ప్రాతినిధ్యం వహించగా మూడు ఫార్మట్ లలో కలిపి 349 వికెట్లు తీశాడు. 
 
అగార్కర్ తోపాటు సెలక్టర్ల  రేస్ లో వున్న మాజీలు : 
 
చేతన్ శర్మ (హరియాణా)
నయన్ మోగింయా (బరోడా)
లక్ష్మణ్ శివరామకృష్ణన్ (తమిళనాడు )
రాజేష్ చౌహన్ (మధ్య ప్రదేశ్ )
అమేయ్ ఖురేషియా (మధ్య ప్రదేశ్ )
గ్యానేంద్ర పాండే (ఉత్తర ప్రదేశ్ )
ప్రీతమ్ గాంధే (విదర్భ )

మరింత సమాచారం తెలుసుకోండి: