ఆగస్టు -సెప్టెంబర్ లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్టులు, మూడు టీ 20లు జరుగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం జులై లో పాక్ జట్టు ఇంగ్లాండ్ లో అడుగుపెట్టనుంది. తాజాగా ఈపర్యటనకు 29మంది ఆటగాళ్లతో కూడిన జట్టు ను ప్రకటించింది పీసీబీ. అందులో 36 ఏళ్ళ బౌలర్ సోహైల్ ఖాన్ కు మళ్ళీ అవకాశం కల్పించగా అండర్ 19 స్టార్ హైదర్ అలీ అలాగే కషిఫ్ బట్టి మొదటి సారి జాతీయ జట్టు కు ఎంపికయ్యారు అయితే ఈ పర్యటనకు స్టార్ బౌలర్ మహమ్మద్ అమీర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ హారిస్ సోహైల్ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నారు. 
 
ఇక ఈపర్యటనకు పాక్ బ్యాటింగ్ జట్టు కోచ్ గా యూనిస్ ఖాన్, స్పిన్ కోచ్ గా ముస్తాక్ అహ్మద్ లను నియమించింది పీసీబీ. పాక్ టెస్టు జట్టుకు అజార్ అలీ టీ 20లకు బాబర్ అజామ్ లు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. బయో సెక్యూర్ వాతావరణం లో ఈ సిరీస్ జరుగనుంది. 
 
అబిద్ అలీ ,ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హాక్ , షాన్ మసూద్ , అజార్ అలీ (టెస్టు కెప్టెన్), బాబర్  అజామ్( టీ 20 కెప్టెన్), అసద్ షఫీక్ , ఫవాద్ ఆలమ్ ,హైదర్ అలీ,ఇఫ్తికర్ అహ్మద్,కుష్ దిల్ షా ,హఫీజ్ ,షోయబ్ మాలిక్, రిజ్వాన్ (కీపర్), సర్ఫరాజ్ (కీపర్), ఫహీమ్ అష్రాఫ్ , హరీష్ రాఫ్ , ఇమ్రాన్ ఖాన్, అబ్బాస్ , హస్నైన్ , నసీం షా ,షహీన్ షా ఆఫ్రిది ,సోహైల్ ఖాన్ , ఉస్మాన్ షాన్వారి , వాహబ్ రియాజ్ , ఇమాద్ వసీం , కషిఫ్ బట్టి , షాదాబ్ ఖాన్, యాసిర్ షా  

మరింత సమాచారం తెలుసుకోండి: