ప్రస్తుతం ఆతిధ్య ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా యాషెస్ సిరీస్ 2021 - 22 జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియా 3-0 తో సిరీస్ ను గెలుచుకుని మంచి ఊపుమీద ఉంది. ఇక ఆడిన మూడు టెస్ట్ లలోనూ దారుణంగా ఓటమి పాలై ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్ల నుండి విమర్శలను అందుకుంటున్నారు. అయితే ఇక మిగిలిన రెండు టెస్ట్ లలో అయినా ఆస్ట్రేలియాను ఓడించి పరువును కాపాడుకోవాలని భావించిన రూట్ సేన మళ్ళీ తడబడుతూ ఆడుతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది.

అయితే ఆరంభంలో తడబడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసి 416  పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఖవాజాతో పాటుగా స్టీవ్ స్మిత్ అర్ధ సెంచరీ సాధించి భారీ స్కోర్ కు పునాదులు వేశారు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ను మొదలెట్టిన ఇంగ్లాండ్ ఎప్పటి లాగే వరుస వికెట్లు కోల్పోతూ వచ్చింది. మరి సరి ఓపెనర్లు మరియు టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ఫెయిల్ అయ్యారు. అయితే మరోసారి తక్కువ స్కోర్ కే అల్ అవుట్ అయ్యేది. కానీ బెన్ స్టోక్స్ మరియు బెయిర్ స్టో ల వీరోచితమైన ప్రదర్శన కారణంగా గౌరవప్రదమైన స్కోర్ ను సాధించగలిగింది.

ఈ దశలో స్టోక్స్ అర్ధ సెంచరీ చేయగా బెయిర్ స్టో మాత్రం 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి పరువు దక్కించుకుంది. ఒకవేళ బెయిర్ స్టో కనుక ఆడకుండా ఉండి ఉంటే 100 పరుగుల లోపే ఆల్ అవుట్ అయ్యుండేది. మరి రేపు నాలుగవ రోజు ఈ మ్యాచ్ లో ఫలితం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: