భారత యువ సంచలనం గా పేరు సంపాదించుకున్నాడు పృద్వి షా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పృథ్వీ షా ఇతనే  భారత జట్టు ఫ్యూచర్ సచిన్ టెండూల్కర్ అంటూ అందరి చేత అనిపించు కున్నాడు. కేవలం అనిపించుకోవడం కాదు తన బ్యాటింగ్ తో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు. కొన్నాళ్ల పాటు ఎంతో అద్భుతంగా రాణించిన పృద్వి షా ఆ తర్వాత మాత్రం టీమిండియాలో కనిపించకుండా పోయాడు. కారణం పూర్తిగా ఫామ్ కోల్పోవడమే అనేది తెలుస్తుంది. ఇక బీసీసీఐ ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ తనని తాను నిరూపించుకో లేకపోయినా పృద్వి షా జట్టు నుంచి పూర్తిగా స్థానం కోల్పోయాడు.


 ఈ క్రమంలోనే మళ్ళీ మునుపటి ఫామ్ అందుకోవడానికి ఇటీవలే రంజీ ట్రోఫీలో భాగంగా ముంబై జట్టు తరఫున కెప్టెన్గా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు మూడు మ్యాచ్ లు ఆడిన పృద్వి షా 9,44, 53 పరుగులు చేశాడు. కేవలం నామమాత్రపు పరుగులు మాత్రమే చేయగలిగిన ఈ యువ ఆటగాడు ఒక్క సెంచరీ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. అదే సమయంలోయష్ దుల్, పరివార్ కోహ్లీ లాంటి వాళ్లు సెంచరీలు సాధిస్తున్నారు. ఇక అటు జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్ ప్లేయర్లు రహానే పూజారులు సైతం ఒకటి రెండు మ్యాచ్ లలో మినహా పెద్దగా రాణించలేకపోయారు.


 ఇలాంటి సమయంలోనే ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృద్వి షా తన బ్యాటింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నా బ్యాటింగ్ చూస్తే నాకే అసహ్యం వేస్తుంది.. రంజీ సీజన్లో నా ప్రదర్శన అంతగా ఆకట్టుకునేలా లేదు. 40,50 స్కోర్లు  పెద్దగా చెప్పుకోదగినవి కాదు. బ్యాటింగ్ లో మార్పులు చేసేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నా.. అయితే ఇప్పటివరకు నేను చేసిన స్కోర్లు మరీ అంత తీసి పారేసేవి కూడా కాదు.. కానీ ఇది సరిపోదు నేను బ్యాటింగ్ లో ప్రూవ్ చేసుకోవాలి అంటే భారీ ఇన్నింగ్స్ కావాలి..  ఐపీఎల్ దగ్గరపడుతుండడంతో ఢిల్లీ క్యాపిటల్స్ తో జాయిన్ అవుతున్నాను.. ఐపీఎల్ లో బాగా రాణించి మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకుంటాను. ప్రస్తుతం నా ధ్యాసంతా ఐపీఎల్ పైనే ఉంది అంటూ పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: