కుటుంబ పోషణ కోసం ఏదో ఒక పని చేసుకుంటూ ఇక క్రికెట్ ఊపిరిగా.. భారత జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా కష్టపడే ఎంతోమందికి ఐపీఎల్ మంచి వేదికగా మారిపోయింది. ఇప్పటివరకూ ఎంతోమంది ప్రతిభ ఉన్న నిరుపేద క్రికెటర్లకు ఐపీఎల్ ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించింది. ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా ఎంతో మంది కొత్త క్రికెటర్లు వెలుగులోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయుష్ బాదోని, తిలక్ వర్మ రూపంలో ఇద్దరు బ్యాట్స్మెన్ వెలుగులోకి వచ్చారు. జితేష్ శర్మ, సుదర్శన్ రూపంలో మరో ఇద్దరు అందరి చూపు ఆకర్షించారు.  ఎప్పుడు ఐపీఎల్ లో ఆణిముత్యం లాంటి ఒక బౌలర్ కూడా తెరమీదికి  వచ్చాడు. అతని పేరు కుల్దీప్ సేన్.


 ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ లో ఆడిన తొలి మ్యాచ్ లలోనే తన సత్తా ఏంటో చూపించాడు. 140 కిలోమీటర్ల వేగంతో కీలక సమయంలో ఒక వికెట్లు పడగొట్టాడు. ఇక లక్నో విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన సమయంలో సంజు శాంసన్ కుల్దీప్ సేన్ కి బౌలింగ్ ఇచ్చాడు.  ఒత్తిడిని జయించి యువ ఆటగాడు అద్భుతంగా రాణించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. కుల్దీప్ సేన్ ప్రస్థానం  ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో హరిపూర్ కు చెందిన వాడు కుల్దీప్  సేన్. అతని తండ్రి పేరు రామ్ పాల్ సేన్. చిన్నపాటి సెలూన్ నడుపుతూ కుటుంబపోషణ చూసుకుంటున్నాడు. ఖాళీ సమయంలో కుల్దీప్  కూడా ఇక తండ్రికి చేదోడు వాదోడుగా సెలూన్ లో  పనిచేసేవాడు.


 చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఆసక్తితో ఇక అటు వైపు అడుగులు వేసాడు కుల్దీప్. అతనికి కోచ్గా ఏరియల్ ఆంతోని ఉండేవారు. అతని వద్దే బౌలింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు. అతడి ప్రతిభకు మెచ్చి స్థానిక అకాడమీ ఫీజులు కూడా మాఫీ చేసింది అంటే  అతని అంకితభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్  జట్టు తరఫున 2018లో రంజీ ట్రోఫీలో ఆడిన కుల్దీప్  ఇందులో పంజాబ్ తో ఆడిన మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు 16 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన కుల్దీప్  44 వికెట్లతో అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 17 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు కనీసం ధర 20 లక్షలకు అతని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl