ఇటీవలి కాలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా మారిపోతుంది. అయితే ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కొన్ని కొన్ని సార్లు అంపైర్లు ఇచ్చే తప్పుడు  నిర్ణయాలు ఏకంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అంపైర్లు అనాలోచిత నిర్ణయాల వల్ల చివరికి మ్యాచ్ ఫలితం కూడా తారుమారు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో ఎంతోమంది అంపైర్లు  తప్పుడు నిర్ణయాల వల్ల తీవ్ర స్థాయిలో అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటిదే జరిగింది.


 ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా 24 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 2022 ఐపీఎల్ లీగ్ లోనే మొదటి విజయాన్ని నమోదు చేసింది. రాబిన్ ఉతప్ప శివం దూబే ఇక ఈ విజయంలో కీలక పాత్ర వహించారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే బెంగళూరు చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 గతంలో ఓ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అవుట్ విషయంలో ఫ్యాన్స్ చేతిలో మొట్టికాయలు తిన్న థర్డ్ ఎంపైర్ ఇక ఇప్పుడు మరింత అడ్డంగా దొరికిపోయాడు. చెన్నై సూపర్ ఇన్నింగ్స్లో నాలుగు ఓవర్ హాజెల్వుడ్ వేసాడు. ఓవర్ నాలుగో బంతిని హాజెల్వుడ్ కాస్త హైట్స్ లో వేసాడు. ఇక బంతి రుతురాజ్ బ్యాట్ ను తాకకుండా ప్యాడ్స్  తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో హాజిల్వుడ్ కూడా అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ గా  ప్రకటించాడు. దీంతో రుతు రాజు వెంటనే రివ్యూ కి వెళ్ళాడు. థర్డ్ ఎంపైర్ పెద్ద డ్రామా  నడిపాడు. రుతూరాజ్ క్యాచ్ అవుట్ అని భ్రమపడి మొదట అదే యాంగిల్లో బంతిని పరిశీలించాడు. బంతి బ్యాట్ కు ఎక్కడా తగ్గలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఫీల్డ్ అంపైర్  వెంటనే స్పందించి తాను ఎల్బి కి రిఫర్ చేశానని  అని మరోసారి గుర్తు చేయడంతో నాలుక కరుచుకుని ఎల్బీ రిఫరల్ పరిశీలించాడు. ఆల్ట్రాసౌండ్ లో బంతి బ్యాట్ కు తగిలి నట్లు గా కనిపించలేదు వికెట్ల కి  తగిలినట్టుగా కనిపించడంతో చివరికి రుతురాజ్ ను ఔట్ గా ప్రకటించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl