ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చే ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ సత్తా చాటి అరుదైన రికార్డును ఖాతాలో వేసుకోవాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో తడబడుతూ చివరికి అరుదైన రికార్డులను కాదు చెత్త రికార్డులను ఖాతాలో వేసుకుని అప్రతిష్ఠ మూట కట్టుకుంటారు. విమర్శలను ఎదుర్కొంటారు. ఇక ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇటీవలే  చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.


 ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో ఇక చివరికి ఇరవై మూడు పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బెంగళూరు పై విజయం సాధించింది. అంతేకాకుండా 2022 ఐపీఎల్ సీజన్  లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్లో ఆర్సిబి బౌలర్ ఆకాష్ దీప్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఒకే ఓవర్లో 11 బంతులు వేసాడు. అంతేకాదు ఇక 24 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.  ఓవరాల్ గా నాలుగు ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.  అయితే అప్పటికే సీఎస్కే బ్యాట్స్ మెన్లు రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే లు పూనకం వచ్చినట్లుగా సిక్సర్లు ఫోర్ల తో ఊగి పోతూ ఉండడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు ఆకాష్ దీప్.


 ఈ క్రమంలోనే 18 ఓవర్ వెయ్యాలి అంటూ ఆకాష్ దీప్ చేతిలో బంతి పెట్టాడు డూప్లేసెస్. ఇక అప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఈ యువ ఆటగాడు ఒకే ఓవర్లో 11 బంతులు వేశాడు. తొలి నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లు ఒక ఫోర్ రావడంతో ఆకాష్ బౌలింగ్  కాస్త లయ తప్పింది. ఈ క్రమంలోనే ఒత్తిడిలో వరుసగా నాలుగు వికెట్లు తీశాడు. తర్వాత మరో రెండు బంతులు వేసిన ఆకాష్ ఓవరాల్గా 24 పరుగులు ఒకే ఓవర్లో సమర్పించుకున్నాడు. దీంతో ఇక ఆర్సిబి అభిమానులు అతని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఒక ఓవర్లో ఆరు బంతులు ఉంటాయి అనే విషయాన్ని మరిచి పోయినట్టు ఉన్నాడు. ఇంకో బంతి వేసుంటే రెండు ఓవర్లు వేసి చరిత్రకెక్కేవాడు అంటూ కామెంట్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl