ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎంతో మంది యంగ్ ప్లేయర్లు సత్తా చాటుతూ ఉంటారు. జాతీయ క్రికెట్ లో పెద్దగా అనుభవం లేకపోయినా ఐపీఎల్లో మాత్రం ఒత్తిడి లేకుండా ఆడుతూ అందరిని ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లు అందరూ కూడా ప్రత్యర్థి బౌలర్ల దాటికి చేతులెత్తేసిన సమయంలో కూడా యంగ్ ప్లేయర్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కూడా ఎంతో మంది యువ ప్లేయర్లు తమ ప్రతిభతో సత్తా చాటుతూ తెరమీదికి వస్తూ ఉన్నారు.


 అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా భారీ ఇన్నింగ్స్ ఆడుతూ అందరి చూపులను ఆకర్షిస్తూ ఉన్నారు. ఇక తామే అంతర్జాతీయ క్రికెట్లో ఫ్యూచర్ స్టార్స్ అని తమ ఆటతీరుతో చెప్పకనే చెబుతున్నారు ఎంతోమంది.  ఇప్పటికే తిలక్ వర్మ లాంటి ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ తెరమీదికి వచ్చాడు.  ఇక ఇప్పుడు మరో యంగ్ ప్లేయర్ కూడా తన టాలెంట్ చూపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. పంజాబ్ కింగ్స్  తరఫున ఆడుతున్న జితేష్ శర్మ కేవలం 15 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు 2 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఇక చివర్లో జితేష్ శర్మ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే పంజాబ్కింగ్స్ 190 పరుగులు చేయగలిగింది.


 ముఖ్యంగా  18 ఓవర్లు బ్యాట్ తో  విరుచుకుపడి ఏకంగా ఓవర్లు 22 పరుగులు పిండుకున్నాడు  జితేష్ శర్మ. దీంతో ఇంతకీ జితేష్ శర్మ ఎవరు అని వెదకడం ప్రారంభించారు పంజాబ్ అభిమానులు. పంజాబ్ కింగ్స్ ఇతని కనీస ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది. మహారాష్ట్రలోని అమరావతి కి చెందిన జితేష్ శర్మ 2014లో విధర్బ తరఫున దేశవాళి క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. 2019 - 20 సీజన్లో విజయ్ హజారే ట్రోఫీ లో 298 పరుగుల చేసి సత్తా చాటాడు. విధర్బ తరఫున టాప్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్గా కూడా నిలిచాడు జితేష్ శర్మ. ఇప్పుడు ఐపీఎల్లో సత్తా చాటడంతో అతని కెరీర్ మలుపు తిరిగే అవకాశం ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl