దాదాపు గత రెండు నెలల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలుసిసలైన క్రికెట్ మజా పంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ నేటితో ముగియనుంది అనే విషయం తెలిసిందే. క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫైనల్ మ్యాచ్ నేడే జరగబోతుంది. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్ కోసం అటు ప్రేక్షకులు అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ ఫైనల్ పోరు జరగబోతుంది.


 ఇలా ఫైనల్లో తలపడుతున్న రెండు జట్లు కూడా ఒకవైపు బౌలింగ్లో మరోవైపు బ్యాటింగ్లో కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నాయ్. దీంతో అంచనాలు మరింత పెరిగి పోయాయి అని చెప్పాలి. అయితే నెడు ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఈ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి ఎన్నో విషయాలు కూడా వెలుగులోకి వస్తూన్నాయి. సాధారణంగా ఫైనల్ మ్యాచ్ అంటేనే ఎంతో ఒత్తిడి తో కూడుకున్నది. ఆ ఒత్తిడిని  జయించినప్పుడే ఏ జట్టు అయినా విజయం సాధించగలిగింది అన్న విషయం తెలిసిందే. మరి ఇలా ఐపీఎల్ ఫైనల్లో ఒత్తిడిని జయించి సిక్సర్లతో చెలరేగిన ఆటగాళ్లు ఎవరు అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.



 ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లలో ఎక్కువ సిక్సర్లు కొట్టి అభిమానులందరినీ కూడా ఉర్రూతలూగించిన బ్యాట్స్మెన్లు లిస్టు చూసుకుంటే... చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేష్ రైనా టాప్ ప్లేస్ కొనసాగుతున్నాడు అనే చెప్పాలి. సురేష్ రైనా ఇప్పటివరకూ ఐపీఎల్ ఫైనల్ లో 13 సిక్సర్లు కొట్టి టాప్ లో ఉన్నాడు. ఇక ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ సైతం ఐపీఎల్ ఫైనల్ లో 13 సిక్సర్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ ఫైనల్లో ఒత్తిడిలో కూడా 12 సార్లు కొట్టేశాడు. మిస్టర్ కూల్ మహేంద్రసింగ్  ధోనీ ఫైనల్లో 11 సిక్సర్లతో ఈ లిస్టు లో ఉన్నాడు. సీనియర్ ప్లేయర్ యూసుఫ్ పఠాన్ ఫైనల్లో 10 సార్లు కొట్టి సత్తా చాటాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: