డేవిడ్ వార్నర్ ను ఆస్ట్రేలియా దేశీయ లీక్ అయిన బిగ్ బాష్ లీగ్ లో ఆడించడానికి క్రికెట్ ఆస్ట్రేలియా భారీ మొత్తంలో ముట్ట చెప్పేందుకు కూడా సిద్ధం అయ్యిందట. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఇలా వార్నర్ వెనుకబడటానికి గల కారణం కూడా లేకపోలేదు. ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు బీడీఎల్ బ్రాడ్కాస్టర్ అయిన ఛానల్ 7క తో ఎంతో చిక్కులు వచ్చాయి. బిగ్ బాస్ లీగ్ టోర్నీ లో క్వాలిటీ లేదని తాను ఎంతగానో నష్టపోతున్నాము అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా పై దావా వేసింది చానల్ 7. ఒకవేళ ఇది నిజం అని తేలితే ఇక క్రికెట్ ఆస్ట్రేలియా ఛానల్ 7కు భారీ మొత్తంలో ముట్ట చెప్పాల్సి ఉంటుంది.
అందుకే నాణ్యమైన ఆటగాళ్లను బిగ్ బాష్ లీగ్ లో భాగం చేసి వ్యూవర్ షిప్ పెంచాలని సంచలన ప్లాన్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇప్పటికే డేవిడ్ వార్నర్ పై ఉన్న కెప్టెన్సీ బ్యాన్ తొలగించకుండా అతనితో బేరాలకు దిగింది అన్నది తెలుస్తుంది. వచ్చే ఏడాది యూఏఈ లో జరగబోయే టీ20 లీగ్ లో ఆడేందుకు సిద్దం అవుతున్నాడు డేవిడ్ వార్నర్. అదే సమయంలో ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ కూడా జరగనుంది. ఒకవేళ ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ యూఏఈ లో జరిగే టి20 లీగ్ ఆడితే.. ఎంతో మంది ప్రేక్షకులు బిగ్బాస్ లీగ్ వదిలేసి యూఏఈ టీ20 లీగ్ చూసే అవకాశం ఉంది. తద్వారా మరింత వ్యూవర్ షిప్ పడిపోతుంది. ఇలా జరగకుండా ఉండేందుకు వార్నర్ కు ఐదు లక్షల డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేసిందట క్రికెట్ ఆస్ట్రేలియా. ఏ జరుగుతుందో చూడాలి మరి.