ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్ లో ఉన్న ఎంతోమంది అత్యుత్తమ బ్యాట్స్మన్ లలో మొదటి వరుసలో ఉంటాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. వార్నర్ కేవలం ఆస్ట్రేలియా క్రికెట్ లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా తన ఆటతో అభిమానులను సంపాదించుకున్నాడు..  ఎన్నో దేశీయ లీగ్ లలో కూడా రాణిస్తూ   ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్లో కూడా సత్తా చాటుతూ వుంటాడు. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు డేవిడ్ వార్నర్ కోసం  క్రికెట్ ఆస్ట్రేలియా సరికొత్త ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.



 డేవిడ్ వార్నర్ ను ఆస్ట్రేలియా దేశీయ లీక్ అయిన బిగ్ బాష్ లీగ్ లో ఆడించడానికి క్రికెట్ ఆస్ట్రేలియా  భారీ మొత్తంలో ముట్ట చెప్పేందుకు కూడా సిద్ధం అయ్యిందట. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఇలా వార్నర్ వెనుకబడటానికి గల కారణం కూడా లేకపోలేదు. ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు బీడీఎల్ బ్రాడ్కాస్టర్ అయిన ఛానల్ 7క తో ఎంతో చిక్కులు వచ్చాయి. బిగ్ బాస్ లీగ్ టోర్నీ లో క్వాలిటీ లేదని తాను ఎంతగానో నష్టపోతున్నాము అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా పై దావా వేసింది చానల్ 7.  ఒకవేళ ఇది నిజం అని తేలితే ఇక క్రికెట్ ఆస్ట్రేలియా ఛానల్ 7కు భారీ మొత్తంలో ముట్ట చెప్పాల్సి ఉంటుంది.


 అందుకే నాణ్యమైన ఆటగాళ్లను బిగ్ బాష్ లీగ్ లో భాగం చేసి వ్యూవర్ షిప్ పెంచాలని  సంచలన ప్లాన్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా.  ఇప్పటికే డేవిడ్ వార్నర్ పై ఉన్న కెప్టెన్సీ బ్యాన్ తొలగించకుండా అతనితో బేరాలకు దిగింది అన్నది తెలుస్తుంది. వచ్చే ఏడాది యూఏఈ లో జరగబోయే టీ20 లీగ్ లో ఆడేందుకు సిద్దం అవుతున్నాడు డేవిడ్ వార్నర్. అదే సమయంలో ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ కూడా జరగనుంది. ఒకవేళ ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ యూఏఈ లో జరిగే టి20 లీగ్ ఆడితే..  ఎంతో మంది ప్రేక్షకులు బిగ్బాస్ లీగ్ వదిలేసి యూఏఈ టీ20 లీగ్ చూసే అవకాశం ఉంది. తద్వారా మరింత వ్యూవర్ షిప్ పడిపోతుంది. ఇలా జరగకుండా ఉండేందుకు వార్నర్ కు ఐదు లక్షల డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేసిందట క్రికెట్ ఆస్ట్రేలియా. ఏ జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: