ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకసారి టీమిండియా కు ప్రాతినిధ్యం వహిస్తే చాలు ఇక సదరు ఆటగాడు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎవరో అనుకోవడం కాదు ఇటీవల కాలంలో ఎంతోమంది క్రికెటర్ల విషయంలో ఇది నిరూపితమవుతుంది అని చెప్పాలి. ప్రొఫెషనల్ క్రికెటర్ గా మారిన తర్వాత ఎంతోమంది లగ్జరీ లైఫ్ గడుపుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. డబ్బు మాత్రమే కాదు ఎంతగానో పేరు  ప్రఖ్యాతలు కూడా వస్తున్నాయ్.


 అయితే ఇవన్నీ నాణానికి ఒక వైపు ఉంటే.. ఇక మరోవైపు ఊహించని రీతిలో కష్టాలు కూడా ఉంటాయి అన్నది కొంతమంది క్రికెటర్ల విషయంలో నిరూపితం అవుతూ ఉంటుంది అని చెప్పాలి. సాధారణంగా ప్రపంచకప్లో చోటు దక్కించుకున్న ఆటగాడు అప్పటికి స్టార్ గా ఎదిగి వుంటాడు. ప్రపంచ కప్ లో చోటు దక్కించుకునీ తర్వాత  రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నాడు ఇక్కడ ఒక క్రికెటర్. అంధుల క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా అందుల క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ బాలాజీ దామోర్ పరిస్థితి అధ్వానం గా మారింది. 1998లో జరిగిన అందుల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో బాలాజీ టీమ్ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాడు.


 జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.. కాగా అప్పుడు భారత జట్టు సెమీస్కు చేరుకుంది. 1998 ప్రపంచ కప్ లో మంచి ప్రదర్శన చేసిన నేపథ్యంలో దివంగత మాజీ రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ నుండి అవార్డు కూడా అందుకున్నాడు. 125 అంతర్జాతీయ మ్యాచుల్లో 3125 పరుగులు  150 వికెట్లు తీశాడు. ఇప్పుడు మాత్రం తినడానికి కూడా తిండి లేక చివరికి గేదెలను మేకలను మేపుతున్నాడు. అతనిది గుజరాత్ రాష్ట్రంలోని ఆరావళి జిల్లా పిప్రనా గ్రామం. గ్రామంలో పనులు చేసుకుంటూ  జీవనం సాగిస్తున్నాడు.  ప్రభుత్వం నుండి సహాయం కావాలని కోరుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: