సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎక్కువమంది గెలిచిన టీం సభ్యులను మాత్రమే అభినందిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. బాగా ఆడారు అందుకే విజయం సాధించారు అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. కానీ ఓడిపోయిన మ్యాచ్ లో ఉండే ఆటగాళ్ల గురించి ఎవరు పెద్దగా మాట్లాడరు. కానీ ఇప్పుడు మాత్రం ఓడిపోయిన జట్టులో ఒక ఆటగాడు గురించి అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అతని వీరోచిత  పోరాటానికి మంత్రముగ్ధులం  అయ్యాము అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.


 ఇది జరిగింది ఏ క్రికెట్ మ్యాచ్ లోనో కాదు.. ఇటీవల సౌత్ ఆఫ్రికా టీమిండియా మధ్య జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో.. ఇంతకీ ఏం జరిగిందంటే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు అదరగొట్టింది. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా ముందు 238 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. ఆ తర్వాత భారీ లక్ష్య చేదనకు బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లలో డేవిడ్ మిల్లర్ మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్ల పై వీర విహారం చేశాడు. బౌలర్లు మారుతున్న అతను సిక్సర్లు ఫోర్లు కొట్టే విధానంలో మాత్రం మార్పు రాలేదు.


 47 బంతుల్లోనే 106 పరుగులు చేసి అదుర్స్ అనిపించాడు. ఇక ఇతనికి మరోవైపు క్వింటన్ డికాక్ 69 పరుగులు చేయగా మంచి సహకారం లభించింది. ఇక డేవిడ్ మిల్లర్ ఇన్నింగ్స్ లో ఏడు సిక్సర్లు ఎనిమిది ఫోర్లు ఉండడం గమనార్హం. అయితే మ్యాచ్ గెలవడం అసాధ్యం అనుకున్న దశలో గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు. మరో ఓవర్ ఉండి ఉంటే డేవిడ్ మిల్లర్ తప్పకుండా మ్యాచ్ గెలిపించేవాడు అని ఎంతో మంది ప్రేక్షకులు భావించారు. ఇక టీమిండియా చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోయినప్పటికీ డేవిడ్ మిల్లర్ మాత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు అని చెప్పాలి. మిల్లర్ ఇన్నింగ్స్ కి ఫిదా అయినా భారత కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరికి వెళ్లి మరి అభినందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: