ఈనెల 23వ తేదీన ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చేస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ రివ్యూలు ఇస్తున్నారు అని చెప్పాలి. ఏ ఆటగాడు ఎలా రానిస్తాడు అనే విషయంపై ఇక తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అదేవిధంగా   ఏ జట్టు గెలుస్తుంది.. ఇక ప్రపంచకప్ విజేతగా ఎవరు నిలుస్తారు అనే విషయంపై కూడా రివ్యూలు ఇస్తున్నారు.


 అంతేకాదు కొంతమంది ఆటగాళ్లు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ గురించి స్పందిస్తూ ఇక తమ ప్లేయింగ్ వివరాలను ప్రకటిస్తూ ఉంటే.. ఇంకొంతమంది టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆల్ టైం ఫేవరెట్ టీ20 వరల్డ్ కప్ జట్టు వివరాలను ప్రకటిస్తూ ఉన్నారు. కాగా ఇలా ఆల్ టైం ఫేవరెట్ జట్టులో భాగంగా ఇక వరల్డ్ కప్ లో పాల్గొంటున్న అన్ని జట్లకు సంబంధించిన ఆటగాళ్లను చేర్చుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై ప్రముఖ కామెంటేటర్ హర్ష బోగ్లే కూడా స్పందించాడు. ఆల్ టైం గ్రేటెస్ట్ టి20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించాడు హర్ష బోగ్లే.


 అయితే హర్ష బోగ్లే  ప్రకటించిన ఆల్ టైం గ్రేటెస్ట్ టి20 వరల్డ్ కప్ జట్టులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడికి మాత్రమే చోటు దక్కడం గమనార్హం. మిగతా ఆటగాళ్లు ఎవరూ కూడా చోటు దక్కించుకోలేకపోయారు. ఇక హర్ష బోగ్లే  ప్రకటించిన జట్టు వివరాలను చూసుకుంటే... క్రిస్ గేల్,బట్లర్, విరాట్ కోహ్లీ,కెవిన్ పీటర్సన్, మైక్ హసి, షేన్ వాట్సన్, షాహిద్ ఆఫ్రిది, ఉమర్ గుల్, లసిక్ మలింగ,  ట్రెంట్ బౌల్ట్, శామ్యూల్ బద్రి లకు చోటు కనిపిస్తూ.. ఆ వివరాలను సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు హర్ష బోగ్లే. ఇక భారత్ నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడికే చోటు ఇవ్వడంపై అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: