సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగిందంటే చాలు ఇక ఎంతోమంది ఆటగాళ్లు ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించడం లాంటివి జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఎవరైనా ఆటగాళ్లు రికార్డులు సాధించారు అంటే ఇక వారికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. కానీ కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఆటగాళ్లు రికార్డులు సాధించిన కూడా వారి పేరు సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించవు. దీనికి కారణం మరి కొంతమంది స్టార్ల పేర్లు తెరమీదకి రావడమే. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి.


 వరల్డ్ కప్ లో భాగంగా ఈనెల 23వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నరాల తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ విరోచితమైన ఇన్నింగ్స్ తో భారత జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో చిరకాల ప్రత్యర్థి  అయిన పాకిస్తాన్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి అతను సాధించిన రికార్డుల గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపించింది.  కాగా కోహ్లీ  ఇన్నింగ్స్ అద్భుతం ఆహా ఓహో అంటూ అభిమానులు అందరూ కూడా తెగ ప్రశంసలు కురిపించారు.


 కానీ విరాట్ కోహ్లీ రికార్డుల మాయలో పడి మరో ఆటగాడు సాధించిన రికార్డు గురించి మాత్రం ఎవరో చర్చించుకోలేదు. టీమిండియా ఫేసర్ భువనేశ్వర్ కుమార్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన రికార్డు సృష్టించాడు. టి20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా రికార్డ్ కేక్కాడు. అక్టోబర్ 23వ తేదీన జరిగిన మ్యాచ్లో షాహిన్ ఆఫ్రిదిని అవుట్ చేసిన భువనేశ్వర్ తన 86వ టి20 వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా చాహల్ ను వెనక్కినట్టే అరుదైన రికార్డు సృష్టించాడు. కానీ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ ఈ రికార్డు గురించి ఎవరు పట్టించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: