టి20 వరల్డ్ కప్ లో భాగంగా సెమి ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయి ఇంటిదారి పట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమిని భారత అభిమానులు మాత్రమే కాదు మాజీ ఆటగాళ్లు కూడా అసలు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే కెప్టెన్సీ మార్పుపై ఎప్పటి లాగానే మరోసారి చర్చ తెరమీదికి వచ్చింది. దీంతో రోహిత్ శర్మను టి20 కెప్టెన్ గా తప్పించి ఇక హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించాలి అంటూ ఎంతోమంది డిమాండ్ చేయడం మొదలుపెట్టారు ఇక ఇదే విషయంపై మాజీ ఆటగాళ్లు కూడా ఏకీభవించారు అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ప్రస్తుతం ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నేటి నుంచి టి20 సిరీస్ ఆడబోతుంది. ఈ క్రమంలోనే జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న వివిఎస్ లక్ష్మణ్  పాండ్యా కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా గొప్ప నాయకుడు. అతని సామర్థ్యం ఏంటో ఐపీఎల్ లీగ్ లో గుజరాత్ ని నడిపించినప్పుడే చూసాం. ఫ్రాంచైజి ఏర్పడిన మొదటి సంవత్సరం జట్టుకు నాయకత్వం వహించి టైటిల్ అందించడం మామూలు విషయం కాదు. ఇక ఐర్లాండ్ సిరీస్ సమయంలో కూడా నేను అతనితో చాలా సమయం గడిపాను. వ్యూహాలకు పదును పెడుతూనే మైదానంలో ప్రశాంతంగా ఉంటాడు. ఇక జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు వారికి ఇలాంటి ఒక కెప్టెన్ ఎంతో అవసరం .


డ్రెస్సింగ్ రూమ్ లో అతడు ఉండే తీరు ఆటలో పాటించే విలువలు ఎంతో గొప్పగా ఉంటాయి. అందుకే హార్దిక్ పూర్తిగా ఆటగాళ్లకు ఇష్టమైన కెప్టెన్ గా మారతాడు అంటూ వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అందరితో సన్నిహితంగా ఉండు అందరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను పంచుకునేలా హార్థిక్ పాండ్యా చూస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు.. మైదానంలోనే కాదు బయట కూడా అతడు నిజమైన నాయకుడు అంటూ ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: