2018 లో బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కున్నాడు డేవిడ్ వార్నర్. ఈ క్రమంలోనే రెండేళ్లపాటు నిషేధం విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఇక మిగతా ఆటగాళ్లపై కూడా ఇలాంటి చర్యలు తీసుకుంది. కానీ ఒక డేవిడ్ వార్నర్ పై మాత్రం ఏకంగా జీవితకాల కెప్టెన్సీ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. అయితే డేవిడ్ వార్నర్ పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఎత్తివేస్తుంది అని ఇక ఎన్నో రోజుల నుంచి అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇటీవల తనపై ఉన్న కెప్టెన్సీ నిషేధం ఎత్తివేసేందుకు ఇక అభ్యర్థన పెట్టుకునేందుకు డేవిడ్ వార్నర్ కి అవకాశం రాగా.. అతను రిక్వెస్ట్ చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా మరోసారి నిషేధం ఎత్తివేయడానికి మొగ్గుచూపులేదు. ఇకపోతే ఇటీవల ఈ విషయంపై చర్చ జరుగుతూ ఉండగా.. డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్ సంచలన విషయాలను బయటపెట్టాడు. సౌత్ ఆఫ్రికా పై ఓడినందుకు ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఆసిస్ ఆటగాళ్లపై మండిపడ్డారు. ఆ టైంలో వార్నర్ కలుగజేసుకొని మ్యాచ్ గెలవాలంటే రివర్స్ స్వింగ్ తోనే సాధ్యమవుతుందని అందుకు బాల్ టాంపరింగ్ చేయాలని కూడా ముందే చెప్పేసాడు. ఇందుకు ఎగ్జిక్యూటివ్స్ అంగీకరించడంతోనే డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్ కి పాల్పడ్డాడు అని షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు వార్నర్ మేనేజర్.