
తాజాగా వీరిలాగే ఇంకో చిచ్చర పిడుగు తనదైన అద్భుతమైన ఇన్నింగ్స్ తో అందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు. గ్రేటర్ నోయిడా లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్ లో దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ మరియు ర్యాన్ ఇంటర్నేషనల్ అకాడమీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 13 సంవత్సరాలు ఉన్న తన్మయ్ సింగ్ అనే యువకుడు ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడాడు. తన్మయ్ తన ఇన్నింగ్స్ ద్వారా ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాడు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ నిర్ణీత ఓవర్లలో 656 పరుగులు చేసింది. ఈ స్కోర్ లో తన్మయ్ సింగ్ ఒక్కడే
401 పరుగులు చేసి మరోసారి అగ్ర క్రికెటర్లను గుర్తు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 38 సిక్సులు మరియు 30 ఫోర్లు ఉన్నాయి.
ఇక ఇదే జట్టుకు చెందిన మరో ఆటగాడు రుద్ర బిధురి 15 సిక్సులు మరియు 5 ఫోర్ల సహాయంతో 135 పరుగులు చేశాడు. కానీ ఇంత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ కేవలం 193 పరుగులకే ఆల్ అవుట్ అయి దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ కు 463 పరుగుల భారీ విజయాన్ని అందించింది. అయితే అంతకు ముందు సచిన్ మరియు కాంబ్లీ ల జోడీ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సచిన్ 326 పరుగులు చేయగా కాంబ్లీ మాత్రం పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ కుర్రాడు వీరిద్దరినీ దాటేశాడు.