ఇటీవల జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా అర్జెంటీనా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లియోనల్ మెస్సి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా మెస్సి కెప్టెన్సి వహిస్తున్న అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకుని ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో మూడు సార్లు విశ్వ విజేతగా నిలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది అని చెప్పాలి. అయితే అర్జెంటినా జట్టు వరల్డ్ కప్  గెలవడంతో ప్రస్తుతం క్రీడ ప్రపంచం మొత్తం లియోనల్ మెస్సి పై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 లియోనల్ మెస్సి తన చివరి వరల్డ్ కప్ ను ఎంతో అద్భుతంగా ముగించాడని.. ఇక చిరకాల కలగా ఉన్న ప్రపంచకప్ ని సాధించి తనకు తిరుగులేదు అని నిరూపించాడని ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే అర్జెంటీనా ఫ్రాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎంతో మంది ఇతర జట్ల అభిమానులు సైతం మెస్సి పక్షాన నిలబడి జట్టుకు మద్దతు తెలిపారు. ఎంతోమంది ఇక మెస్సి పై ప్రశంసలు కురిపిస్తూ ఉండగా ఇక మరో దిగ్గజ  ప్లేయర్ అయిన క్రిస్టియనో రోనాల్డో  సైతం మెస్సి అద్భుతమైన విజయం పై స్పందిస్తూ ప్రశంసించాడు.


 ప్రపంచ కప్ స్టార్ గా కాకుండా ఒక యుగానికి నాయకత్వం వహించిన మేధావికి విలువైన వీడ్కోలు దక్కింది. నిజంగా మెస్సి కి అభినందనలు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు రోనాల్డో  అయితే మరో స్టార్ ప్లేయర్ అయినా క్రిస్టియనో రోనాల్డో కి కూడా ఇదే చివరి వరల్డ్ కప్ అన్న విషయం తెలిసిందే  అయితే వరల్డ్ కప్ లో భాగంగా మోరాకో చేతిలో పరాజయం పాలైన పొర్చుగాల్ జట్టు సెమీఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. దీంతో మెస్సి వరల్డ్ కప్ సాధించినప్పటికీ క్రిస్టియనో రోనాల్డో కు మాత్రం వరల్డ్ కప్ కలగానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: