
సామ్ కరన్ గొప్ప ఆల్ రౌండర్. అతను బ్యాట్‌తో చాలా స్పీడ్ గా పరుగులు సాధించగలడు. ఇంకా అలాగే బౌలింగ్‌తో కూడా చాలా అద్భుతాలు చేయగలడు. కొత్త బంతితో అద్భుతాలు చేసే సత్తా ఉన్న సామ్ డెత్ ఓవర్లలో కూడా ఈజీగా పరుగులు ఆపగలడు. లోయర్ ఆర్డర్లో చాలా స్పీడ్ గా పరుగులు సాధించగల సత్తా ఉంది.రీసెంట్ గా ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ఇంగ్లండ్ గెలుచుకోగా అందులో సామ్ కరన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు.ఈ ప్రపంచకప్‌లో సామ్ కరన్ ఏకంగా 13 వికెట్లు తీసి సూపర్ అనిపించాడు.
ఇక ఐపీఎల్ వేలం చరిత్రలో మరో రికార్డు కూడా నెలకొంది. వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్ ఇప్పటి దాకా అత్యంత ఖరీదైన వికెట్ కీపర్‌గా నిలిచాడు.అతన్ని ఏకంగా రూ. 16 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది. అంతకుముందు అత్యధిక పారితోషికం అందుకున్న వికెట్ కీపర్ గా ముంబై ఆటగాడు అయిన ఇషాన్ కిషన్ మొత్తం 15.25 కోట్లతో నిలిచాడు.బౌలింగ్ ఆల్‌రౌండర్లు చాలా ఎక్కువ ధర పలికారు. ఈ ఆల్ రౌండర్లు కేవలం 30 నిమిషాల్లో రూ. 59 కోట్లు వసూలు చేశారు. ఐపీఎల్‌లోని 10 జట్ల వద్ద ఏకంగా 206.5 కోట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటి దాకా 10 మంది ఆటగాళ్లకు మొత్తం 83 కోట్లు ఖర్చు చేశారు. 87 మంది ఆటగాళ్లను కొనాల్సి ఉండగా మొత్తం 405 మంది ఆటగాళ్లను వేలం వేశారు.