
సరికొత్త జీవితం మొదలు పెట్టేందుకు అతనికి దారులు దొరికాయి అని చెప్పాలి. ఇటీవల జరిగిన 2023 ఐపీఎల్ మినీ వేలంలో 5.5 కోట్లు ధర వెచ్చించి ఈ యువ బౌలర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. దీంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే ఇలా మినీ వేలంలో భారీ ధర పలికిన ఆనందంలో ఉన్న అతనికి ఇటీవలే మరో లక్కీ ఛాన్స్ తలుపు తట్టింది అని చెప్పాలి.ఎన్నో రోజుల నుంచి అతను నిరీక్షణగా ఎదురుచూస్తున్న భారత జట్టు నుంచి పిలుపు రాని వచ్చింది. వచ్చే నెలలో శ్రీలంకతో జరగబోయే టి20 సిరీస్ లో ముఖేష్ కుమార్ భారత జట్టులో భాగమయ్యాడు.
ఇలా కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఐపీఎల్లో భారీ ధర పలకడం ఇక అంతలోనే తనకు చిరకాల వాంఛ ఆయన భారత జట్టులో చోటు దక్కడం జరిగి అతని జీవితం మొత్తం మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతను వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. కాగా ముఖేష్ కుమార్ తండ్రి కోల్‌కతాలో ఉన్నప్పుడు టాక్సీ నడుపుతూ జీవనం సాగించేవాడు. ఇక ముఖేష్ కుమార్ కష్టపడి బెంగాల్ జట్టులో స్థానం సంపాదించుకుని భారత ఏ జట్టులోకి కూడా వచ్చాడు. ఇక ఇప్పుడు ఏకంగా భారత జట్టులోకి అరంగేట్రం చేసి తన కలను నెరవేర్చుకున్నాడు..