
ఓటమి ఎరుగని సారథిగా కూడా నిలిచాడు అని చెప్పాలి. శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోవడంతో హార్థిక్ పాండ్యా ఖాతాలో కెప్టెన్గా మొదటి ఓటమి చేరిపోయింది అన్న విషయం తెలిసిందే. కెప్టెన్ గా పాండ్యా వరుస విజయాలకు బ్రేక్ పడింది అని చెప్పాలి. ఇక ఇటీవలే ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హార్దిక్ పాండ్యాకు అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలు ఉన్నాయి. అయితే ప్రతి మ్యాచ్ తర్వాత అతడికి కెప్టెన్సీ గురించి మనం చర్చించ కూడదు అంటూ గౌతమ్ గంభీర్ చెప్పొచ్చాడు. ఒక్క మ్యాచ్లో ఓటమి పాలు అయినంత మాత్రాన హార్దిక్ పాండ్యా ఏదో తప్పు చేశాడని భావించడం సరికాదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్నప్పటికీ బౌలర్లు నో బాల్స్ వేయకుండా నియంత్రించడం సాధ్యం కాదు. అది బౌలర్ బాధ్యత. ఇప్పటి వరకు అతడు సారథిగా వ్యవహరించిన ప్రతి మ్యాచ్లో తన కెప్టెన్సీ మార్కు చూపించాడు. ఇక మైదానంలో ఎంతో కూల్ గా కూడా ఉంటాడు. ఇప్పుడు సహచర ఆటగాళ్లకు మద్దతు ఇస్తూ ఉంటాడు అంటూ గౌతమ్ పేరు చెప్పుకొచ్చాడు.