ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ఆడుతుంది. ఇక ఇటీవలే సిరీస్ లో భాగంగా ఇటీవలే హైదరాబాద్లోనే ఉప్పల్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్ లో 12 పరుగులు తీయడంతో భారత జట్టు విజయం సాధించింది. అయితే భారతజట్టు విజయం సాధించింది అంటే అందుకు కారణం అటు గిల్ డబుల్ సెంచరీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక డబుల్ సెంచరీ కారణంగా ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు శుభమన్ గిల్. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


 అత్యంత పిన్నవయసులో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. అంతకుముందు ఇషాన్ కిషన్ పేరిట ఈ రికార్డు ఉండగా.. 23 ఏళ్ల 132 రోజుల వయసులో ఈ గిల్ డబుల్ సెంచరీ రికార్డు సాధించాడు.

 ఇక ఉప్పల్ స్టేడియంలో అత్యధిక స్కోర్ చేసిన రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 2009లో 175 పరుగులు చేయగా.. ఇదే అత్యధిక స్కోర్ గా ఉండేది. కానీ ఇటీవల గిల్ డబుల్ సెంచరీ చేశాడు.

 ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోర్ రెండవ అత్యధిక స్కోర్ మధ్య గ్యాప్ రికార్డ్ సృష్టించాడు. గతంలో రోహిత్ 264 కోహ్లీ 66 పరుగులు చేయగా.. వీరి మధ్య 198 పరుగులు తేడా ఉంది ఇక ఇప్పుడు గిల్, రోహిత్ ల మధ్య 174 పరుగులు తేడా ఉండడం గమనార్హం.

 వరుస వన్డే ఇన్నింగ్స్ లో సెంచరీ డబుల్ సెంచరీ తో పాటు హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన ఘనత కూడా సాధించాడు.

 అది తక్కువ అంటే 19 వన్డేలోనే మూడు సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ తర్వాత స్థానాన్ని దక్కించుకున్నాడు.

 ఇక 19 వన్డే లోనే ఈ ఫార్మాట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకుని కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఈ రికార్డులో మొదటి స్థానంలో పాక్ ఆటగాడు ఫకర్ జమన్ 18 ఇన్నింగ్స్లతో  ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: