
ఇక ఇలాంటి ప్లేయర్లపై నేపాల్ క్రికెట్ బోర్డు సరైన నిర్ణయం తీసుకుంది అంటూ ఎంతో మంది ప్రేక్షకులు కూడా భావించారు. అయితే ఇక ఇప్పుడు నేపాల్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. ఏకంగా అత్యాచార ఆరోపనులు ఎదుర్కొంటున్న సందీప్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు రెడీ అయింది. నేపాల్ క్రికెట్ బోర్డు ఈనెలాకరున జరగబోతున్న వరల్డ్ కప్ లీగ్ ట్రై సిరీస్ లో మళ్లీ సందీప్ మైదానంలోకి దిగబోతున్నాడు అన్నది తెలుస్తుంది.
ఇటీవల జరిగిన నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సమావేశంలో సందీప్ పై ఉన్న నిషేధం ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇక ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు. ఇక ట్రై సిరీస్ లో భాగంగా నమీబియా, స్కాట్ ల్యాండ్ జట్లతో అతడు మళ్లీ నేపాల్ జట్టు తరఫున ఆడబోతున్నాడు. 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం కేసులో సందీప్ అరెస్టు అయ్యాడు సందీప్. అయితే అతనికి కోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ వచ్చింది అన్నది తెలుస్తుంది. అయితే అతను విదేశీ పర్యటనలో ఆడతాడో లేదో అన్నదానిపై మాత్రం పూర్తి క్లారిటీ లేదు. కేవలం కోర్టు అనుమతిస్తేనే విదేశీ పర్యటనకు వెళ్లేందుకుఅవకాశం ఉంటుంది.