
అయితే ఆస్ట్రేలియా తో ప్రస్తుతం టెస్ట్ సిరీస్ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతు ఉన్నాడు అన్న విషయం తెలిసిందే సాధారణంగానే రవిచంద్రన్ అశ్విన్ ఎంతో తెలివైన స్పిన్నర్. ఎవరికీ ఎక్కడ బంతివేయాలి అన్నది అతనికి బాగా తెలుసు. అయితే అటు ఆస్ట్రేలియాపై అతనికి ఇంకా మంచి రికార్డు ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఉన్న స్టార్ బ్యాట్స్మెన్లు అశ్విన్ బంతులకు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక అశ్విన్ ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఒక బౌలర్ను నియమించుకొని మరి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు అటు ప్రాక్టీస్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ చీప్ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ ఫామ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫలితాన్ని నిర్ణయిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా కోసం ఎక్కువగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం లేదు అంటూ సూచించాడు. అతని రెగ్యులర్ వ్యూహాలకు కట్టుబడి ఉంటే చాలు. అశ్విన్ అన్ని వేదికలలో ప్రపంచ స్థాయి బౌలర్. కానీ సొంత దేశంలో మాత్రం ఎంతో ప్రమాదకరమైన వాడు అంటూ రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు.