భారత క్రికెట్లో వికెట్ కీపింగ్ గురించి ప్రస్తావన వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అని చెప్పాలి. ఎందుకంటే వికెట్ కీపర్ గా ధోని భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు ధోని. వికెట్ల వెనకాల కీపింగ్ చేస్తూ ఉన్నాడు అంటే చాలు. క్రీజులో ఉన్న బ్యాట్స్మెన్ భయపడుతూనే బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలీ. ఏ చిన్న పొరపాటు చేసిన చివరికి స్టంప్ అవుట్ కావాల్సి వస్తుంది అనే అనుమానంతోనే ఆచితూచి ఆడుతూ ఉంటాడు.


 ఇక వికెట్ల వెనకాల ఉంటూ మెరుపు వేగంతో స్టంప్ అవుట్లు చేయడంలో ధోని దిట్ట అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు భారత జట్టు తరఫున ఎంతో మంది వికెట్ కీపింగ్ చేసినప్పటికీ ధోని పేరు మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. అయితే అప్పుడప్పుడు కొంతమంది వికెట్ కీపర్లు ధోని తరహాలోనే మెరుపు వేగంతో స్టంప్ అవుట్లు చేసి చివరికి వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అవకాశం దక్కించుకున్న తెలుగు క్రికెటర్ కెఎస్ భరత్ ఇటీవల  ఇలా ధోని తరహాలోనే స్టంప్ అవుట్ చేశాడు.


 ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలీ. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 36 ఓవర్ని జడేజా వేశాడు. ఈ క్రమంలోనే జడేజా ఓవర్లో ఐదో బంతికి లబుషేన్ ఫ్రెంట్ ఫుట్ కు వచ్చి కవర్ డ్రైవ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు  అయితే బంతి మిస్ అయ్యి నేరుగా వికెట్ కీపర్ భారత్ చేతుల్లోకి వెళ్ళింది. దీంతో బంతిని అందుకున్న భరత్ మెరుపు వేగంతో బెయిల్స్ ని పడగొట్టాడు. ఈ క్రమంలోనే ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ థర్డ్ అంపైర్ కు రిఫర్ చేయగా.. అన్ని కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ చివరికి అవుట్ గా ప్రకటించాడు. దీంతో టీం ఇండియా సంబరాల్లో మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: