క్రికెట్ కి భారత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ని బాగా ఆస్వాదిస్తూ ఉంటారు అని చెప్పాలి. క్రికెట్ మ్యాచ్ వస్తుంటే చూసి ఆస్వాదించడమే కాదు బ్యాటు, బాల్ పట్టుకొని మైదానంలోకి దిగి ఎంతోమంది ఇక క్రికెట్ ను స్వయంగా ఆడటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది యువకులు అటు క్రికెట్ ని ప్యాషన్ గా మార్చుకుని ఇక దేశవాలి క్రికెట్ లో బాగా రానించి అంతర్జాతీయ క్రికెట్ లోకి వస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.


 అయితే ఒకప్పటితో పోల్చి చూస్తే ఇటీవల క్రికెట్లోని అన్ని విభాగాల్లో కూడా ప్రమాణాలు మరింత మెరుగయ్యాయి. ముఖ్యంగా ఫీల్డింగులో అయితే ఎంతోమంది చూపిస్తున్న తెగువ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ప్లేయర్లు కొన్ని కొన్ని సార్లు అసమాన్యమైన రీతిలో  ప్రతిభను ప్రదర్శించి ఇక ప్రేక్షకులు అందరిని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక్కడ జిల్లాస్థాయి క్రికెట్ పోటీలలో అసమాన్యమైన రీతిలో ఒక వ్యక్తి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.


 ఇక వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే.. అది ఒక లోకల్ మ్యాచ్ అన్నది తెలుస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్మెన్ ఎంతో అలవోకగా బౌండరీ దాటించే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బౌండరీ అవతలికి దూసుకుపోతున్న సమయంలో ఇక బౌండరీ లైన్ వద్ద ఫీలింగ్ చేస్తున్న యువకుడు క్యాచ్ ని ఒడిసి పట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ లైన్ అవతలికి వెళ్ళాడు. ఇక అంతకుముందే బంతిని గాల్లోకి ఎగరేస్తాడు. ఇక మళ్ళీ కిందికి వస్తున్న బంతిని ఏకంగా ఫుట్బాలర్ తరహాలోనే ఒక కిక్ ఇచ్చాడు. ఇంకేముంది ఆ బంతి వెళ్లి పక్కనే ఉన్న మరో ఫీల్డర్ చేతుల్లో పడింది. దీంతో ఎంపైర్ అవుట్ గా ప్రకటించాడు. అయితే ఇది చూసిన ఎంతోమంది ఇది క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్ అని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: