బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కారణంగా ఎంతో మంది మహిళా క్రికెటర్లకు స్వర్ణ యుగం ప్రారంభమైంది అని ప్రస్తుతం ఎంతోమంది చెబుతున్న మాట. ఇక ఇటీవలే అటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించిన మెగా వేలం ప్రక్రియ కూడా జరిగింది.  అయితే ఈ వేలంలో ఎంతోమంది మహిళా క్రికెటర్లు పలికిన ధర చూసిన తర్వాత ఇక ప్రతి ఒక్కరు కూడా మహిళా క్రికెట్ కి నిజంగానే స్వర్ణ యుగం ప్రారంభమైంది అని నమ్ముతున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు అంతంత మాత్రం వేతనాలు మాత్రమే తీసుకొని కష్టాల కడలిలోనే క్రికెట్ ఆడిన మహిళా క్రికెటర్లు ఇక ఇప్పుడు అటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కారణంగా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని దక్కించుకుంటున్నారు.


 ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో ఇక ఎంతోమంది ప్లేయర్లు రికార్డు స్థాయి ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు కర్నూలు అమ్మాయి అంజలి సైతం మెగా వేలంలో జాక్పాట్ కొట్టేసింది. ఇప్పటికే టీమిండియా తరఫున ఆడుతుంది అంజలి. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళ టి20 ప్రపంచ కప్ లో ఇక జట్టులో సభ్యురాలుగా ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ముంబై వేదికగా జరిగిన వేలంలో ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ కోసం ఫ్రాంచైజీలు తెగ పోటీ పడ్డాయి అని చెప్పాలి. 30 లక్షల కనీస ధరలతో వేలంలోకి వచ్చిన అంజలిని దక్కించుకునేందుకు యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్,  ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి.


 చివరికి 50 లక్షలకు యూపీ వారియర్స్ అంజలిని దక్కించుకుంది అని చెప్పాలి. కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన అంచలి ఇంటర్ ఫెయిల్ కావడం గమనార్హం. కాగా అంజలి తండ్రి రమణ గవర్నమెంట్ టీచర్. అమ్మ గృహిణి.  అంజలికి తమ్ముడు విక్రమాదిత్య కూడా ఉన్నాడు. అయితే చిన్నతనం నుంచే ఆమెకు క్రీడలపై మక్కువ. స్కూల్ స్థాయిలోనే క్రీడల్లో నిరూపించుకుంది. బాగా చదువుకోకుండా క్రీడలు అంటూ తిరిగితే జీవితం నాశనం అవుతుందని ఎంతమంది విమర్శిస్తున్న పట్టించుకోకుండా తన లక్ష్యం వైపు దూసుకువెల్లింది. ఇంటర్లో అంజలి ఒక సబ్జెక్టు ఫెయిల్ అయింది. ఇటీవలే మళ్లీ ఆ సబ్జెక్ట్ పాస్ అయ్యి డిస్టెన్స్  ద్వారా బిఎ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేసింది. ఇక ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl