బీసీసీఐ ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో విజయవంతంగా 15 ఏళ్లు పూర్తి చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది  16వ సీజన్ జరగబోతుంది. ఈ క్రమంలోనే 15 ఏళ్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు తెరమీదికి వచ్చారు. ఇంకా ఎంతో మంది కొత్త కెప్టెన్లు కూడా ప్రపంచ క్రికెట్కు పరిచయం అయ్యారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక 15 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎంతో అద్భుతంగా రాణించిన ఆటగాళ్ల లిస్ట్ ను తయారు చేసి ప్రముఖ క్రీడా ఛానల్ అయినా స్టార్ స్పోర్ట్స్ కొన్ని అవార్డులను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే.


 ఇందులో భాగంగానే ఐదుసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మకు బెస్ట్ కెప్టెన్ అవార్డును ప్రకటించింది. ఇక ఆ తర్వాత ఏబి డివిలియర్స్ విరాట్ కోహ్లీలను బెస్ట్ బ్యాట్స్మెన్ గా అవార్డు ప్రకటించింది. ఇక బౌలర్లుగా బుమ్రా, నరైన్ లకు.. ఇంపాక్ట్ ప్లేయర్ గా రసెల్ కు అవార్డును కట్టబెట్టింది అని చెప్పాలి. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో కెప్టెన్ గా రికార్డులు సొంతం చేసుకుని మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న ధోనీకి మాత్రం ఎలాంటి అవార్డు ప్రకటించకపోవడంతో అభిమానులందరూ కూడా హర్ట్ అయ్యారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోనీ కోసం స్పెషల్ గా ఒక అవార్డును సిద్ధం చేసింది. స్టార్ స్పోర్ట్స్ అన్నది తెలుస్తుంది. రెస్ట్ ఇన్ హిస్టరీ అనే టాగ్ లైన్ తో ఒక పోస్టర్ ను స్టార్ స్పోర్ట్స్ తమిళ్ రిలీజ్ చేసింది అని చెప్పాలి. దీంతో ధోని ఫాన్స్ అందరు కూడా ఆనందంలో మునిగిపోయారు. ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే 2023 ఐపీఎల్ సీజన్లో టైటిల్ కొట్టడమే లక్ష్యంగా ధోనిసేన బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది అని చెప్పాలి. కాగా ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ధోనీకి చివరి ఐపీఎల్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న వార్తలు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: