
ఇక తుది జట్టులోనూ రోహిత్ శర్మ రెండు కీలక మార్పులు చేయడం విశేషం. వరుసగా ఫెయిల్ అవుతున్న కె ఎల్ రాహుల్ పై వేటు వేశారు. అతని స్థానంలో శుబ్ మాన్ గిల్ కు యాజమాన్యం అవకాశం కల్పించింది. ఇక బౌలర్ షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇక రెండు వరుస ఓటములను జీర్ణించుకోలేని ఆస్ట్రేలియా జట్టులో కూడా రెండు మార్పులు చేశారు .. కామెరూన్ గ్రీన్ మరియు స్టార్క్ లు జట్టులోకి వచ్చారు. ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మతో (12) సహా ... గిల్ (21), పుజారా (1), కోహ్లీ (22), శ్రేయస్ అయ్యర్ (0) , భరత్ (17), జడేజా (4) , అశ్విన్ (3), ఉమేష్ (17) మరియు సిరాజ్ (0) లు అవుట్ కాగా, అక్షర్ పటేల్ (12) ఒక్కడే నాట్ అవుట్ గా నిలిచాడు.
ఇండియా ఆటగాళ్ల బలహీనతలతో ఆస్ట్రేలియా బౌలర్లు ఆటాడుకుని మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 109 పరుగులకే కుప్పకూల్చారు. యువ స్పిన్నర్ కూనేమాన్ 5 వికెట్లు మరియు నాథన్ లయాన్ మూడు వికెట్లు, మర్ఫి 1 వికెట్ దక్కించుకున్నారు. రెండు టెస్ట్ లలో ఆస్ట్రేలియాను ఓడించిన ఇండియా... మూడవ టెస్ట్ లో మాత్రం దారుణంగా విఫలం అవుతోంది. మరి రెండవ ఇన్నింగ్స్ లో అయినా బౌన్స్ బ్యాక్ అవుతుందా చూడాలి.