మన దేశంలో అయితే ఇతర క్రీడల్లో ఎంత స్టార్ లుగా ఉన్నప్పటికీ పెద్దగా క్రేజ్ ఉండదు. కానీ క్రికెటర్లకు అయితే ఊహించని రీతిలో పాపులారిటీ ఉంటుంది. అయితే ఇతర దేశాల్లో అయితే క్రికెటర్ల కంటే ఎక్కువగా అటు ఫుడ్ బాలర్ లకు  బ్రహ్మరథం పడుతూ ఉంటారు క్రీడాభిమానులు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఫుట్బాల్ ఆటలో కొత్త స్టార్లు వెలుగులోకి వస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పటికే నేటి జనరేషన్లో లియోనల్ మెస్సి, క్రిస్టియానో రోనాల్డో ఇద్దరు కూడా స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు. ఇక వీరిద్దరికీ ప్రపంచ నలుమూలలో సైతం అభిమానులు ఉన్నారు అని చెప్పాలి.


 ఇక వీరిద్దరూ ఒకసారి మైదానంలోకి దిగారు అంటే చాలు ప్రత్యర్థులకు వణుకు పుట్టించే విధంగా చిరుత పులిలా కదులుతూ అభిమానులను తమ ఆట తీరుతో అలరిస్తూ ఉంటాడు. అయితే గత ఏడాది ఖాతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచ కప్ లో కొత్త స్టార్ ప్లేయర్ తెరమీదకి వచ్చాడు. అతను ఎవరో కాదు ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం భాగిస్తున్న ఎంబాపె. ఇక తన ఆట తీరుతో ఒక్కసారిగా అభిమానుల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు అని చెప్పాలి. ఇక స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. అయితే ఇలా ఎవరైనా ఫుడ్ బాలర్ మంచి ప్రదర్శన చేశాడు అంటే చాలు ఇక అతనికి సోషల్ మీడియాలో పెరిగే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


ఈ క్రమంలోనే ఎంబాపె ఇటీవల సోషల్ మీడియాలో ఒక అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. రోనాల్డో, లియోనల్ మెస్సి, నైమర్ తర్వాత ఇంస్టాగ్రామ్ లో 100 మిలియన్లు ఫాలోవర్లను సంపాదించుకున్న నాలుగో ఫుడ్ బాలర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ లో అర్జెంటినాతో జరిగిన మ్యాచ్ లో హాట్రీక్స్ సాధించి అందరి మనవళ్లు పొందాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా తమ అభిమాన ఆటగాడు సోషల్ మీడియాలో వంద మిలియన్ల ఫాలోవర్లను సంపాదించిన నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా అతనికి శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: