భారత్లో ఎన్నో రకాల క్రీడలు ఆడే ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఎందుకో క్రికెట్ కె ఎక్కువగా క్రేజ్ ఉంది అన్న విషయం తెలిసిందే. క్రికెట్ అంటే  చాలు అటు ప్రేక్షకులు అందరూ కూడా పడి చచ్చిపోతూ ఉంటారు. క్రికెటర్లను దేవుళ్ళ లాగా ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పాలి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు ఇక టికెట్ రేటు ఎంత ఉన్నప్పటికీ లెక్కచేయకుండా కొనుక్కొని స్టేడియం కు వెళ్లి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. మరి కొంతమంది టీవీల ముందు కూర్చొని కన్నార్పకుండా మ్యాచ్ చూడటం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే భారత్లో క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య ఇక మిగతా క్రీడల్లో బాగా రాణిస్తున్న ఆటగాళ్లకు సైతం అన్యాయం జరుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే స్టార్ క్రికెటర్ల క్రేజ్ మాయలో పడిపోతున్న క్రీడాభిమానులు ఇతర క్రీడాకారుల ప్రతిభను మాత్రం గుర్తించలేకపోతున్నారు అని చెప్పాలి. ఇక ఇలా ఇప్పటివరకు భారత జట్టు తరపున అసమాన్యమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ సరైన గుర్తింపు పొందలేకపోయిన ఆటగాళ్ల జాబితాలో అటు భారత ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్న సునీల్ చెత్రి కూడా ఒకరు అని చెప్పాలి.


 ఇప్పుడు వరకు అంతర్జాతీయ మ్యాచ్లలో యాక్టివ్ గా ఉన్న ఫుడ్ బాలర్ల జాబితాలో ఎక్కువ గోల్స్ కొట్టిన వారిలో రోనాల్డో 118, మెస్సి 98 ఉండగా.. ఆ తర్వాత భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి 84 గోల్స్ తో ఉన్నాడు. వేరే దేశంలో అయితే అభిమానులు ఇతన్ని కళ్ళకు అద్దుకునేవారు. కానీ మనదేశంలో మాత్రం పట్టించుకునే వారే లేకుండా పోయేవారు. ఇక ఇలా  ఎన్నో ఏళ్ల నుంచి భారత జట్టు కోసం పోరాడిన సునీల్ చెత్రి త్వరలో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారట. ఏఎఫ్సి ఏషియన్ కప్ అతనికి చివరి టోర్ని కావచ్చు అని కోచ్ ఇగోర్ స్టీమక్ పేర్కొన్నాడు. వయస్సు రీత్యా అతను ఇక ఫుట్బాల్ కు వీల్కోలు పలికే అవకాశం ఉంది. సునీల్ రాణిస్తాడని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు కోచ్. కాగా ప్రస్తుతం సునీల్ చెత్రి వయసు 38 ఏళ్లు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: