మాట్లాడితే చాలు 40 ఏళ్ల రాజకీయం, తనకంటే సీనియర్ రాజకీయ నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా అని గొప్పలు చెప్పుకునే వ్యక్తులు ఇప్పుడు చేస్తున్న రాజకీయాలను చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలనే విషయాన్ని సైతం పక్కన పెట్టేసి, చేస్తున్న రాజకీయాలను చూస్తుంటే నిజంగా రాజకీయాలపైన విరక్తి కలుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, రకరకాలుగా అష్టవంకర్లుగా నాలుకను మడత పెట్టి మాట్లాడడం ఏపీలో కొంతమంది రాజకీయ సీనియర్లకు అలవాటుగా మారిపోయింది. గతంలో సిబిఐపై ఒంటికాలిపై లేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన 40 ఏళ్ల రాజకీయ బాహుబలి ఇప్పుడు అదే సిబిఐ ను అదేపనిగా పొగుడుతూ కీర్తించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతోంది. 

IHG's existential crisis


గతంలో అదే సీబీఐ ను తిట్టిన నాలుక ఇదే కదా ఇప్పుడు పొగుడుతోంది అంటూ మాట్లాడుకుంటున్నారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉండగా చోటు చేసుకున్న అనేక అక్రమాలపై సీబీఐ కన్ను వేయడం, వీటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతుందనే వార్తల నేపథ్యంలో అసలు ఏపీలో సిబిఐ అడుగుపెట్టేందుకు వీల్లదంటూ జీవో జారీ చేశారు. అంతేకాదు ఆ సిబిఐ కేంద్ర పెద్దల చేతుల్లో కీలుబొమ్మ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు అదే సీబీఐ ఏపీలో హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీలో దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు అదే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పందిస్తూ సిబిఐ పై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఏపీలో సిబిఐ విచారణను స్వాగతిస్తున్నాం అంటూ మాట్లాడారు. 

 

విశాఖలోని మత్తు డాక్టర్ సుధాకర్ అంశంపై ఏపీ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించిన కొద్ది నిమిషాల్లోనే ఈ విధమైన స్పందన కనిపించింది. 2018లో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా 2018 నవంబర్ లో ఏపీలో సిబిఐ అడుగుపెట్టేందుకు వీల్లేదంటూ గత టీడీపీ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. అప్పుడు ఈ అంశాన్ని తప్పుపట్టేందుకు కానీ, ఇదేంటి అని ప్రశ్నించేందుకు కానీ టిడిపి అనుకూల మీడియా సాహసం కూడా చేయలేకపోయింది. ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సిబిఐ ఏపీలో అడుగుపెట్టకుండా అప్పటి టిడిపి ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేశారు. ఇప్పుడు అదే సీబీఐ ను కీర్తిస్తూ టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా మాట్లాడుతున్న, వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఏ ఎండకు ఆ గొడుగు అనే విషయం గుర్తొస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: