అసలు వీళ్ళకి రాజకీయం అంటే ఏం తెలుసు ? ఎక్కడ ఎవరు చనిపోయినా దాన్ని తీసుకొచ్చి ప్రత్యర్థుల పాపం ఇది అంటూ ఆ నెపాన్ని అవతల వాళ్ళ మీదకు నెట్టేసి హమ్మయ్య ..! రాజకీయం చేసేసాం ప్రత్యర్థిని ఇరుకుల్లో పెట్టేశాం అనుకుంటూ ఇదేనా రాజకీయం అని సంబరపడిపోతున్న పవన్, లోకేష్ కి ఇప్పుడు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా ఓ భారీ షాక్ తగలడంతో ఇప్పుడు జరిగిన డ్యామేజ్ కి కుయ్యో మొర్రో అంటూ సైలెంట్ అయిపోయారు. ఎక్కడో గుడివాడ నియోజకవర్గంలో ఎవరో పెద్దాయన అనారోగ్యంతో మరణిస్తే ఉల్లి పాయల కోసం క్యూలో నిలబడి చనిపోయాడు. ఆ పాపం ఈ ప్రభుత్వానిదే అంటూ, జగన్ మీద కాస్తా , ఆ కోడలి నాని మీద ఇంకాస్తా వెయ్యాలని చూస్తే ..? ఆ మృతి చెందిన వ్యక్తి కుమారుడు కాస్త గట్టిగానే గడ్డి గాదం పెట్టగానే సైలెన్స్ అయిపోయారు.

ఇప్పుడు అమరావతి కథలోకి వస్తే మళ్ళీ అదే సీన్ రిపీట్. అనారోగ్యంతో ఓ పెద్దాయన మరణిస్తే ఇప్పుడూ అదే సీన్. అమరావతి కోసం భూములు ఇచ్చాడని, రాజధాని ఇక్కడి నుంచి తరలి వెళ్లిపోతుందేమో అని భయంతో గుండె ఆగిపోయింది అంటూ మళ్ళీ అదే కల్లిబొల్లి కథనాలను సోషల్ మీడియాలో లోకేశం బాబు పెట్టగానే కళ్యాణం బాబు కూడా అదే రాగం అందుకున్నాడు. అమరావతి ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం లో తన తండ్రి చిన లాజర్ మరణాన్ని ఇలా రాజకీయ పార్టీలన్నీ కలిసి రాజకీయం చేసిపడేసుకోవడాన్ని లాజర్ కుమార్తె ఎస్తేరు ఫైర్ అయిపోయి గట్టిగానే లోకేశం కళ్యాణం బాబులను తగులుక్కున్నారు.



 '' మా నాన్న గారి గురించి ఎవడు చెప్పాడు నీకు చెప్పు తీసుకుని కొడతా రాస్కెల్ ని ... వాడికి తెలుసా భూముల కోసం గుండె ఆగింది అని... వెధవ జనసేన లో భజన చేసి దిక్కులేక ఇప్పుడు పచ్చ జండా పట్టి చావులను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటానికి బుద్దిలేదా వాడికి లేదు విద్యావేత్తవేగా నీకు తెలియదా అంటూ గట్టిగానే అటాక్ ఇచ్చారు. అంతకు ముందే జనసేన అధినేత పవన్ కు కూడా గట్టిగానే పెట్టారు.


 ''ఏమయా పవన్ ఇప్పుడు గుర్తొచ్చారా మా నాన్న గారు... ఆయన అమాయకత్వం అడ్డం పెట్టుకుని ఆత్మీయ తండ్రి అంటూ పొగడ్తలతో మురిపించి నీ పబ్బం గడుపుకున్నావు... 2019 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి ఏ పంచ చేరావు??ఇప్పుడు సానుభూతి చెప్పుకొస్తున్నావు అంటూ కౌటర్ ఇచ్చేసరికి అసలు ఏం చేయాలో తెలియక దిమ్మ తిరిగి బొమ్మ కనబడిపోయింది పాపం పవన్ కూ ఈ లోకేశం బాబుకి అయ్యో పాపం.

మరింత సమాచారం తెలుసుకోండి: