ఆ సీక్రెట్ ఎవరికీ చెప్పేది కాదు. అయినా అందరికీ తెలిసిందే. పదవి ఇచ్చి పడేస్తే ఎవరూ పార్టీ మారారు. మరో దారి లేక పార్టీనే పట్టుకుని వేలాడతారు అనే టాప్ సీక్రెట్. అంతేనా పార్టీ పిలుపు ఇస్తే రాను .. కుదరదు అనే మాట చెప్పకుండా చచ్చినట్టు వస్తారు అనే అతిపెద్ద ఉపాయం వేసేశారు. ఆ ఉపాయాంతోనే ఇప్పుడు ఎప్పుడూ వినని, చూడని పదవులను కొత్త కొత్త పేర్లు పెట్టి మరీ ఇచ్చేసారు. పొత్తులు పెట్టుకునేందుకు పక్క పార్టీల నేతలను బతిమాలాడుకునేందుకు ఓ పదవిని ఇచ్చిపడేసారు.
అసలు పార్టీలో మ్యాటర్, జనాల్లో నమ్మకం ఉండాలి, సొంత నాయకులకు ఎప్పటికైనా గెలుస్తాము అనే భరోసా ఉండాలి కానీ ఈ పదవులిస్తే అధికారం ఏమైనా వస్తుందా ఏంటి ? చక్కగా నాయకులందరికీ పదవులిచ్చి రోడ్లమీదకు వచ్చి నానా హడావుడి చేస్తూ పార్టీ కోసం పోలీసు దెబ్బలు, పోలీసు కేసులు ఎదుర్కుంటూ ఉంటే చిన రాజాగారు మాత్రం హాయిగా చివరాఖరిలో వచ్చి సింహాసనం ఎక్కేందుకు రెడీ అయిపోతారన్నమాట. దెబ్బలు .. దొబ్బులు వాళ్లకి సింహాసనం మాత్రం చిన రాజాగారిది. అదిరిపోయిందయ్యా రెండు కళ్ళ సిద్ధాంతం. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి ..? ఏ పార్టీ గురించి అనే కదా మీ డౌట్ ?? ఈ పాటికి మీకు అర్ధమయ్యే ఉంటుందిలే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి