బావా ఎప్పుడు వచ్చితీవి వచ్చి...  ఏమీ పీకితివి.. అని అదేదో సినిమాలో పాట ఉన్నట్టుగా ఇప్పుడు అదేపనిగా నాని వంటివారితో తిట్టి పోయించుకుంటున్న బావ, మేనల్లుడు ప్లస్ అల్లుడు పై ఓ రేంజ్ పాట పాడాలి అనుకుంటున్న బాలయ్య బాబు కి. ఓ వైపు తీవ్ర ఆగ్రహం ఉన్నా, వారిని అందరిలాగే పైకి పాట పాడి తిట్టిపోస్తే ఆ తర్వాత జరిగే నష్టం ఏమిటో బాగా తెలియడంతో, వారి చేతకానితనాన్ని ఏమీ అనలేక , ఇప్పుడు నందమూరి వారసులకు పరమభక్తుడైన నాని పై దండయాత్ర చేసేందుకు దబిడి దిబిడి బాలయ్య బాబు దిగిపోయినట్టు గా కనిపిస్తున్నారు. ఒక్కసారిగా నందమూరి భక్తుడైన నాని పై విమర్శలు మొదలుపెట్టారు. 


మా బావ... మా అల్లుడు జోలికి వెళితే మామూలుగా ఉండదు . సమర సింహారెడ్డి , నరసింహారెడ్డి , సింహ , ఇలా అందర్నీ రంగంలోకి దించి అందరి ఆట కట్టిస్తా అన్నట్లుగా ఇప్పుడు హడావుడి బాలయ్య బాబు హడావుడి చేస్తున్నారు. బాలయ్య బాబు దబిడి దిబిడి కామెంట్స్ తో కాస్తో కూస్తో హైప్ వచ్చినట్లుగా కనిపించడంతో, నాని కి కౌంటర్ ఇచ్చేందుకు దబిడి దిబిడే డైలాగ్స్ తో మెప్పించేందుకు బాలయ్యనే ఇక నాని పై  రంగంలోకి దించితే ఎలా ఉంటుందనే ఆలోచనలో తండ్రి కొడుకులు ఉన్నారట. 



చూడు ఒకవైపే చూడు రెండోవైపు చూడకు అన్నట్టుగా నానికి బాలయ్య బాబు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. ఇక ఏపీ రాజకీయాల్లో నాని మాటల తూటాలు... బాలయ్య బాబు తొడగొట్టుడుతో ఏపీ రాజకీయాలు వేడెక్కి ... బోయపాటి సినిమా లోని భారీ భారీ ఫైట్స్ ఉండేలా కనిపిస్తున్నాయి. అవసరమైతే గుడివాడ లో వచ్చే ఎన్నికల్లో బాలయ్య బాబుని రంగంలోకి దించి ఆ నియోజకవర్గం లో తొడ కొట్టించే కార్యక్రమానికి పెద బాబు, చినబాబు రెఢీ అయిపోయారట. అమ్మో ఇక ఏపీ రాజకీయాల్లో పగలు.. పుగలు... సెగలు వచ్చి దడ దడలు వచ్చేలా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: