ఏ రాజకీయ నాయకుడు కు ఏ సినీ హీరోకు లేనటువంటి అభిమానులు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలు , విధి విధానాలు, ఇవేవీ పట్టించుకోకుండా.. అసలు పార్టీ నుంచి ఎటువంటి సూచనలు వచ్చినా, రాకపోయినా జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ జనసేన తరపున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, పవన్ కు మొదటి నుంచి అండదండగా ఉంటూ వస్తున్నారు. ఇక పవన్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ కు అదే సంక్రాంతి. ఇక ఈ మధ్యనే రాజకీయంగాను యాక్తి వ్ అయిన పవన్ తాను నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా గురించి ప్రసంగాల రూపంలో ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఆ మధ్యన కొడాలి నాని అడ్డాగా ఉన్న గుడివాడ కి వెళ్లి మరి పవన్ సవాల్ చేశారు. జగన్ కు చెప్పండి ... వకీల్ సాబ్ చెప్పాడు అంటూ పంచ్ డైలాగ్ కూడా పేల్చి వైరల్ చేశారు.





 ఇదిలా ఉంటే తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వకీల్ సాబ్ ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సన్నివేశాన్ని సోషల్ మీడియాలో వైసిపి టిడిపి శ్రేణులు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నాయి. '' కోర్టు రూమ్ లో గౌరవ జడ్జిగారి ముందు ఇలా పెన్నులు విసిరి బల్లలు గుద్ది " అబ్జెక్షన్ యువరానర్ " అంటే రూడ్ బిహేవియర్ అని , కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ కింద జడ్జిగారు వాతలు పెడతారు రా అయ్యా ... అవునులే జనసేన పిల్లలు ఈలలు వేయాలి అంటే ఆ మాత్రం ఓవరాక్షన్ ఉండాలి లే .." అంటూ సోషల్ మీడియాలో వకీల్ సాబ్ ట్రైలర్ పై సెటైర్లు పడుతున్నాయి. 




దీనిపై జనసైనికులు తీవ్రస్థాయిలో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాలోని పాత్రలను గుర్తుచేస్తూ వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు. " తొడ కొడితే ట్రైన్ లు వెనక్కి వెళ్ళి పోవాలి. బండేసుకుని ట్రైన్ పైకి ఎక్కేయాలి. పారాషూట్ వేసుకుని పాకిస్తాన్ వెళ్లిపోవాలి. మైకా కవర్ లు పెట్టుకుని పైనుండి దూకి వేయాలి. కోడిని వదిలితే మర్డర్లు చేసి రావాలి. యుగపురుషుడు బారెడు పొట్టేసుకొని స్పైడర్ మ్యాన్ లా గాల్లో ఎగరాలి. అప్పుడే గుర్తుంచుకుంటారు అనుకుంటా వీళ్ళు"   అంటూ టీడీపీ పై జనసైనికులు విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: