పంచాయితి ఎన్నికల ఫలితాల్లో కొన్ని చిత్ర విచిత్రంగా ఉన్నాయి. మొత్తం 13 వేల చిల్లర పంచాయితీలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ సుమారు 80 శాతం పంచాయితీలను కైవసం చేసుకుంది. ఈ విషయంలో చంద్రబాబునాయుడు ఎంత సొల్లు చెబుతున్నా ఎవరు పట్టించుకోవటం లేదు. సరే ఏ పంచాయితిలో ఏ పార్టీ గెలిచిందనే విషయాన్ని పక్కన పెట్టేస్తే కొన్ని నియోజకవర్గాల్లో నూరుశాతం టీడీపీ అడ్రస్ గల్లంతవ్వటం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. అందుబాటులో ఉన్న సమాచరం ప్రకారం ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీ మద్దతుదారులు ఒక్కటంటే కనీసం ఒక్క పంచాయితిలో కూడా గెలవలేదు.




కడప జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగు పంచాయితిల్లో టీడీపీ మద్దతుదారులు ఖాతానే తెరవలేదు. గుంటూరు జిల్లాలోని మాచర్చ, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, నెల్లూరు రూరల్, అనంతపురం హెడ్ క్వార్టర్స్ నియోజకవర్గంలో కూడా పసుపు పార్టీ మద్దతుదారుల్లో ఒక్కళ్ళు కూడా గెలవలేదు. ఇలా నూరుశాతం అధికారపార్టీనే గెలవటం గతంలో ఎప్పుడు జరగలేదంటున్నారు. కడప జిల్లాలోని పులివెందులలో టీడీపీ గెలవలేకపోయిందంటే అర్ధముంది. పులివెందులలో  వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేదు. పైగా ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి అక్కడ టీడీపీ మద్దతుదారులు గెలవలేకపోయారంటే అర్ధముంది. మరి జమ్మలమడుగులో కూడా గెలవకలేకపోయారు. ఎందుకంటే ఇక్కడ బలమైన నేతలే టీడీపీలో లేకుండాపోయారు.




కడప జిల్లా పరిస్దితిని అర్ధం చేసుకోవచ్చు. మరి సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరులో ఏమైంది ? అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం కాబట్టి ఆయన ధాటిని కూడా టీడీపీ తట్టుకోలేకపోయిందా ? మంత్రి ధాటినే తట్టుకోలేకపోతే ఇక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చంద్రబాబు చెప్పుకోవటం ఎందుకు ? గుంటూరులోని మాచర్ల, నెల్లూరు రూరల్, అనంతపురంలో జేసీ బ్రదర్స్ కు ఏమైంది ? అంటే పై నియోజకవర్గాల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు టీడీపీ సీనియర్లు ఎందుకు కనీసం ప్రయత్నం కూడా చేయలేదన్న విషయం పార్టీలో ఇపుడు చర్చనీయాంశమవుతోంది. అధికారంలో ఉన్నపుడు చాలామంది అనేక వీరంగాలు వేసిన విషయం అందరికీ తెలిసిందే. అంటే అధికారంలో ఉన్నపుడే చాలామంది నేతలు కనబడతారు. అదే ప్రతిపక్షంలోకి వచ్చేస్తే ఎక్కడా అడ్రస్ కనబడరని తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: