న‌వ్వులు నాలుగు రకాలు.. రంగులు ఏడు ర‌కాలు.. ఇంకొన్ని కూడా క‌లిసి ఉంటే ఓ వంద ర‌కాలు కూడా త‌యారు చేయించ‌వ చ్చు. ఇప్పుడు రంగులు ఎలా ఉన్నా రాజకీయం మాత్రం కొత్త కొత్త విధంగా క‌నిపిస్తోంది. అధికార మ‌రియు అన‌ధికార వ‌ర్గాల‌కూ చుక్క‌లు చూపిస్తోంది. ఈ దశ‌లో ఎవ‌రు గెలుస్తారో ఎవ‌రు ఓడిపోతారో అన్న‌ది తెలియ‌కున్నా పాపం వీరిద్దరినీ అన‌గా జ‌గ‌న్ మ‌రి యు చంద్ర‌బాబును కొంత కాలం ఏడిపిద్దాం అని అనుకుంటున్నాడు మోడీ.. అలా అనుకోవ‌డం వెనుక అనేక స్వార్థ కార‌ణాలు ఉ న్నాయి. కానీ అవ‌న్నీ రాజ‌కీయ సంబంధ‌మే అయిన‌వి. గతంలో త‌న‌తో ఫ్రెండ్ షిప్ చేసిన చంద్ర‌బాబుకు ఇప్పుడు ఫ్రెండు అను కుంటున్న జ‌గ‌న్ ఇలా ఎవ‌రికి వారే మోడీకి కావాల్సిన వారు. అందుక‌నే పాపం మోడీ ఎవ్వ‌రికీ అన్యాయము చేయ డం ఇష్ట‌ము లేక అలా ఉండిపోతున్నాడు. ఇప్పుడు రాష్ట్రం లో ఏ గొడ‌వ జ‌రిగినా కేంద్రం చూస్తూ ఉంటుంది. త‌గువు పెద్ద‌ద‌యితే కేంద్రానికే స‌ర దా! మొన్న‌టి నీటి వివాదాల కార‌ణంగా కొన్ని విలువ‌యిన ప్రాజెక్టులు అన్నీ కేంద్రం ఖాతాలోకి పోయాయి. అలా అన్న మాట.



ఇద్ద‌రు కొట్టుకున్నా ర‌క్తాలు చిందించుకున్నా చొక్కాలు చింపుకున్నా ఇవ‌న్నీ కేంద్రానికి హాయిగా న‌వ్వు పుట్టిస్తుంటాయి.. అదే రా జకీయం.. మ‌నం చూస్తూ ఉండాలి. మోడీ కూడా మ‌న‌లానే చూస్తూ ఉండాలి. మ‌న‌ది నిస్స‌హాయ‌త వాళ్ల‌ది నాట‌కీయత‌. నాట‌కీ య‌త నెగ్గి నిస్స‌హాయ‌త ఓడిపోవ‌డ‌మే రాజ‌కీయంలో సిస‌లు ల‌క్ష్యం కావాలి. అదే అంతిమం కూడా!


మ‌నం న‌వ్వుతాం..మోడీ కూడా న‌వ్వుతాడు. మ‌నం ఏడుస్తాం.. మ‌న‌ల్ని చూసి ఇంకొంద‌రు ఏడుస్తారు. కానీ మోడీ అభివృద్ధికి మోడ‌ల్ క‌నుక ఆయ‌న‌ను చూసి ఇత‌ర దేశాల ప్ర‌ధానులు ఏడుస్తారు. అదేవిధంగా ఆయ‌నను చూసి కాంగ్రెస్ ఇంటి దిక్కు సోని యా, పెద్ద దిక్కు అయిన సోనియా కూడా ఏడుస్తుంది. రాహుల్ ఏడుస్తాడు. రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ ఎవ‌రైనా ఉండే ఉంటే వాడు కూడా ఏడుస్తాడు. ఏదేమ‌యినా ఎదుగుతున్న వారిని చూసి ఏడ్వ‌డం కామ‌న్. అలా ఏడ్వ‌డం మంచిది కూడా! ఆరోగ్యం కూడా! ఇప్పుడు ఆంధ్రావ‌ని ప‌రిణామాలు చూసి చంద్ర‌బాబు ఏడుస్తున్నాడు జ‌గ‌న్ కూడా కొంతలో కొంత ఏడుపున‌కు సిద్ధం అవుతున్నా డు. వీరిద్ద‌రినీ చూసి మోడీ న‌వ్వుతున్నాడు. మీ ఇద్ద‌రూ నాకు కావాల్సిన వాళ్లే క‌నుక నేనేం చేయ‌ను చేయ‌లేను క‌నుక మీ ఏ డుపులు మీరు ఏడిస్తే నేను కాస్త చూసి న‌వ్వ‌గ‌ల‌ను త‌ప్ప ఏం చేయ‌లేను అని తేల్చేశాడు మోడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: