తెలుగు సినిమా వచ్చిన తొలి రోజుల్లో ఉన్న అగ్ర హీరోలలో దివంగత అక్కినేని నాగేశ్వరావు ఒకరు. ఈయన తెలుగు మరియు తమిళ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు. దాదాపు 65 సంవత్సరాల పాటు తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషలలో కలిపి 256 సినిమాలు చేశారు. తను చనిపోయే వరకు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. నాగేశ్వరావు చివరిగా మనం సినిమాలో నటించాడు. నాగేశ్వరరావు తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ కి తెలుగు సినిమా పరిశ్రమను తీసుకురావడం లో కీలక పాత్ర పోషించాడు. ఈయన జీవితంలో తన నటనకు ఎన్నో బిరుదులను మరియు పురస్కారాలను పొందాడు. అవేమిటో ఒకసారి చూద్దాం. నటనా జీవితంలో ఫిల్మ్ ఫేర్, నంది, కళా సాగర్ వంటి అవార్డులను అందుకున్నాడు. ఇవి మాత్రమే కాకుండా మరీ కొన్ని అవార్డులను సైతం నాగేశ్వర రావు పొందాడు.

1968 లో భారత ప్రభుత్వం వారు పద్మశ్రీ అవార్డును ఇచ్చి గౌరవించారు.

1977 వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ బిరుదుతో పాటు డాక్టరేట్ ను పొందడం జరిగింది.

 1980 లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో భారత ప్రభుత్వం గౌరవించింది.

అత్యున్నత పురస్కారంగా బావించే  పద్మ భూషణ్ ను 1988 లో భారత ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది. అదే సంవత్సరం సాహితీ సాంస్కృతిక సంస్థ తెనాలి వారు ఈ విశిష్ట వ్యక్తి అవార్డును ఇవ్వడం జరిగింది.

1989 వ సంవత్సరంలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్ వారు రాజ్ కపూర్ స్మారక అవార్డుతో గౌరవించారు.

చలం చిత్ర పరిశ్రమలో ఎంతో విశిష్టమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1991 లో భారత్ ప్రభుత్వం బహూకరించింది.

1994 వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ పిట్స్ బర్గ్ వారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ఇవ్వడం జరిగింది.

2011 లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ఇచ్చి గౌరవించింది.

ఇలా తన సినీ జీవితంలో చేసిన అనేక సేవలకు గానూ పై విధంగా అవార్డులు వరించాయి. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో గొప్ప గొప్ప పాత్రలు చేసి అలరించిన అక్కినేని నాగేశ్వర రావు నేడు మన మధ్య లేకపోయినా ఆయన సినిమాల రూపంలో ఇప్పటికే ప్రేక్షకుల గుండెల్లో బ్రతికే ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: