ధన అహంకారమే దరిద్రుణ్ణి చేస్తుంది. ధనాన్నీ, భార్యనీ నిర్లక్ష్యం చేస్తే దూరమవుతాయి. డబ్బులున్నప్పుడు ఆ ధన అహంకారంతో గొప్పకొసం కీర్తికోసం విచ్చలవిడిగా ఖర్చుపెడితే మిగిలేది దు:ఖ. లక్షలు వేలు ఖర్చుపెట్టిన చేతులు వందరూపాయలకి కూడా చాపాల్సి వస్తుంది. సంపద ఉన్నపుడు పక్కన చేరిన వారంతా మిమ్మల్ని హీరోగా చేస్తారు. వారి అవసరాలనీ, సరదాలనీ, వ్యసనాలనీ మీ మీద రుద్దుతారు. మీరే వారి జీవితంలా ప్రవర్తిస్తారు. అంతా అవ్వగానే ఎవ్వరూ కనపడరు. అంతవరకైతే పర్వాలేదు. మీకే వ్యతిరేకంగా మాట్లాడుతారు. మీ శత్రువులతో, విరోధులతో చేరిపోతారు. ఆ శౌర్య అహంకారాల తోనే రాజులనుంచి మహాసంపదలు తెచ్చి ధర్మరాజు రాజసూయయాగం చేశాడు. సకలరాజకోటి చేత జేజేలు కొట్టించుకున్నాడు. నరదిష్ఠిని పొందాడు. నెలరోజుల్లోనే కట్టుబట్టలతో మాయాజూదంలో ఓడి అరణ్యవాసానికి సోదరులతో ద్రౌపదితో వెళ్ళాల్సి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: